Navodaya Vidyalaya: 6వ తరగతి విద్యార్థుల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్

జవహార్ నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి విద్యార్థుల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు ఉచిత విద్యా సదుపాయాన్ని పొందవచ్చు.

Last Updated : Nov 4, 2020, 10:01 PM IST
    • జవహార్ నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి విద్యార్థుల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
    • ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు ఉచిత విద్యా సదుపాయాన్ని పొందవచ్చు.
    • ఇంటర్మీడియట్ వరకు ఉచిత వసతి, భోజన సదుపాయం వీరికి కల్పిస్తారు.
Navodaya Vidyalaya: 6వ తరగతి విద్యార్థుల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్

జవహార్ నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి విద్యార్థుల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు ఉచిత విద్యా సదుపాయాన్ని పొందవచ్చు. ఇంటర్మీడియట్ వరకు ఉచిత వసతి, భోజన సదుపాయం వీరికి కల్పిస్తారు. నవోదయ విద్యాలయాలో ( Navodaya Vidyalaya ) నిర్వాహకులు వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తారు.

Also Read | TS High Court: అగ్రీగోల్డ్ కేసు విచారణను స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

తెలుగు రాష్ట్రాల్లో..
2021-2022 విద్యా సంవత్సరం కోసం భారతదేశ ( India ) వ్యాప్తంగా ఉన్న విద్యాలయాల్లో ఆరవ తరగతి విద్యార్థులను అడ్మిషన్స్ కోసం ఆహ్వానించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 661 స్కూళ్లు ఉండగా అందులో 15 విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ( Telangana ) 9 ఉన్నాయి. ప్రతీ నవోదయా విద్యాలయంలో 6వ తరగతి విద్యార్థుల కోసం 80 సీట్లను కేటాయిస్తారు. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులకు ఈ అవకాశం దక్కుతుంది.

Also Read | Acharya: నవంబర్ 9 నుంచి ఆచార్య షూట్... 

ఒక్క ఛాన్స్ మాత్రమే
ప్రస్తుతం 5వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు జవహార్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ ( JNVST )పరీక్షల కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో అర్హత  సాధించాల్సి ఉంటుంది. ప్రతీ విద్యార్థికి ఈ ఎగ్జామ్ లో పాల్గొనే అవకాశం కేవలం ఒకసారి మాత్రమే లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం 75 శాతం సీట్లను కేటాయిస్తారు. మరో 25 శాతం సీట్లను ఇతర ప్రాంతాల విద్యార్థులకు కేటాయిస్తారు.

Also Read | AP Board of Intermediate: విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News