ఉపఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు

                                                         

Last Updated : May 31, 2018, 05:48 PM IST
ఉపఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు

పలు రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 4 ఎంపీ, 11 ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి. మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీయేతర పక్షాలు (కాంగ్రెస్ తో కలిపి) 9 స్థానాలు కైవసం చేసుకోగా..అధికార బీజేపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. 

ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే మొత్తం నాల్గు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా బీజేపీ కూటమి రెండు స్థానాల్లో గెలుపొందగా బీజేపీయేతర పక్షాలు రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. నాలుగేళ్లలో బీజేపీపై ప్రతిపక్షాలు ఈ స్థాయిలో గెలుపొందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఈ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేధు అనుభావన్ని మిగల్చగా.. బీజేపీయేతర పక్షాల్లో ఆశలు చిగురించారు. తాజా ఫలితాలతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

4 లోక్‌సభ స్థానాలు : 

కైరానా(ఉత్తర్‌ప్రదేశ్): ఆర్ఎల్డీ ( గెలుపు)
పాల్ఘర్(మహారాష్ట్ర): బీజేపీ (గెలుపు)
భండారా–గోండియా(మహారాష్ట్ర): ఎన్సీపీ (గెలుపు)
నాగాలాండ్: బీజేపీ కూటమి (ఎన్‌పీఎఫ్) ( గెలుపు)

 

11 శాసన సభ స్థానాలు :

షాకోట్‌(పంజాబ్‌): కాంగ్రెస్ (గెలుపు)
పశ్చిమ బెంగాల్ మహేస్థల: టిఎంసి (గెలుపు)
జోకిహట్‌(బిహార్‌):  ఆర్జేడీ (గెలుపు)
గొమియా(జార్ఖండ్‌): బీజేపీ (గెలుపు)
సిల్లీ(జార్ఖండ్‌): జెఎంఎం (గెలుపు)
చెంగన్నూరు(కేరళ):  సీపీఎం (గెలుపు)
నూపుర్‌(ఉత్తర ప్రదేశ్‌): సమాజ్ వాది (గెలుపు)
థరాలి(ఉత్తరాఖండ్‌): బీజేపీ (గెలుపు)
అంపటి (మేఘాలయ): కాంగ్రెస్ (గెలుపు)
పాలుస్‌ కడేగావ్‌(మహారాష్ట్ర): కాంగ్రెస్ (గెలుపు)
రాజరాజేశ్వరి నగర్(కర్ణాటక): కాంగ్రెస్ (గెలుపు)

Trending News