Gaganyaan Yatra: ప్రతిష్ఠాత్మక భారత దేశ సంస్థ ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్ కార్యక్రమంపై అందరిలో ఆసక్తి నెలకొంది. కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదురవడంతో యాత్ర ఉంటుందా అనేది ప్రశ్నార్ధకంగా మారిన నేపధ్యంలో ఇస్రో స్పష్టత ఇచ్చింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇస్రో (ISRO)ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ కార్యక్రమంపై స్పష్టత వచ్చింది. కరోనా సంక్షోభం కారణంగా ఏడాది కాలంగా గగన్‌యాన్ యాత్రపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అంతరిక్షరంగంలో విజయవంతంగా దూసుకుపోతున్న ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మరో ప్రాజెక్టు గగన్‌యాన్ యాత్ర. ఈ యాత్రలో భాగంగా తొలి మానవ రహిత అంతరిక్షనౌకను నింగిలోకి పంపాల్సి ఉంది.ఈ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలలోనే (Gaganyaan on Schedule)ప్రారంభం కానుందని ఇస్రో వెల్లడించింది. అందుకే కాలంతో పోటీ పడి పనిచేస్తున్నామన్నారు. కరోనా సంక్షోభం కారణంగా హార్డ్‌వేర్ సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్టు ఇస్రో తెలిపింది.
డిసెంబర్ నెలలో తొలి మానవ రహిత అంతరిక్ష నౌకను నింగిలోకి పంపిన తరువాత 2022-23లో మరో మానవ రహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను (Space craft)అంతరిక్షంలోకి పంపాల్సి ఉంది. లోఎర్త్ ఆర్బిట్‌లో మనుషుల్ని అంతరిక్ష నౌకలో పంపించి..తిరిగి క్షేమంగా వెనక్కి తీసుకురావడమే గగన్‌యాన్(Gaganyaan)ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే నలుగురు వ్యోమగాముల్ని ఎంపిక చేసిన రష్యాలో శిక్షణ అందిస్తున్నారు. కరోనా సంక్షోభం ఎదురైనా సరే షెడ్యూల్ ప్రకారమే గగన్‌యాత్ర ఉంటుందని స్పష్టం చేసింది ఇస్రో.
Also read: Moderna Vaccine: ఇండియన్ మార్కెట్‌లో త్వరలో మోడెర్నా వ్యాక్సిన్, అనుమతివ్వనున్న డీసీజీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook