గర్భంతో ఉన్న ఏనుగు మరణం (Elephant Death Case) దేశ వ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే. ఈ కేసులో పురోగతి లభించింది. ఏనుగు చావుకు కారణమైన కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఒకరిని అరెస్ట్ చేసినట్లు కేరళ అటవీశాఖ మంత్రి కె.రాజు మీడియాకు తెలిపారు. కేసు దర్యాప్తును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. జాతీయ మీడియా ఏఎన్ఐ ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు: హరీష్ రావు
కాగా, ఆకలితో ఉన్న ఓ ఏనుగు పాలక్కాడ్ జిల్లాలోని ఓ గ్రామంలో ప్రవేశించగా పటాకులు నింపిన ఓ పైనాపిల్ పండును దానికి ఆహారంగా అందించారు. ఆశగా పండును నోట్లు వేసుకోగానే భారీ శబ్ధంతో అది పేలిపోవడం, గర్భంతో ఉన్న గజరాజు (Pregnant Elephant) కు రక్తస్రావం కావడం క్షణాల్లో జరిగిపోయాయి. లాక్‌డౌన్‌లో అందాల ‘నిధి’ని చూశారా!
ఇంత జరిగినా తనకు ఇలా చేసిన వారిపై ఎలాంటి దాడి చేయకుండా సమీపంలోని వెల్లియార్ నది వద్దకు వెళ్లింది. ఈగలు, కీటకాలు ముసరకుండా నీళ్లల్లో తొండాన్ని ముంచుతూ సేదతీరింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని ఏనుగును కాపాడేయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. పండులో పటాసులు.. గర్భంతో ఉన్న ఏనుగు నరకయాతనతో మృతి
గర్భంతో ఉన్న ఏనుగు కొన్ని గంటల తర్వాత చనిపోయింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసన, ఆందోళన, ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసును సీరియస్‌గా తీసుకున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
బీ అలర్ట్.. గంటల తరబడి కూర్చుంటున్నారా! ఇది చదవండి