Online Food: వెజ్‌కి బదులుగా నాన్-వెజ్ ఫుడ్‌ డెలివరీ.. జొమాటో-మెక్‌డొనాల్డ్స్‌కు షాకిచ్చిన కస్టమర్

Penalty on Zomato and McDonalds: శాఖాహారం బదులు మాంసాహారం డెలవరీ చేసినందుకు జొమాటో, మెక్‌డోనాల్డ్ సంస్థలపై లక్ష రూపాయల జరిమానా పడింది. ఈ మేరకు వినియోదారుల ఫోరమ్ తీర్పునిచ్చింది. అంతేకాదు కేసు ఖర్చుల కోసం రూ.5 వేలు కూడా చెల్లించాలని ఆదేశించింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2023, 11:32 PM IST
Online Food: వెజ్‌కి బదులుగా నాన్-వెజ్ ఫుడ్‌ డెలివరీ.. జొమాటో-మెక్‌డొనాల్డ్స్‌కు షాకిచ్చిన కస్టమర్

Penalty on Zomato and McDonalds: ఇటీవల ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయగానే.. క్షణాల్లో కోరిన ఫుడ్ వచ్చేస్తుండడంతో ఆన్‌లైన్ ఫుడ్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఆన్‌లైన్‌ ఫుడ్ డెలవరీ చేసేందుకు వివిధ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ సమయంలో ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ తప్పుల కారణంగా ఆన్‌లైన్ డెలవరీ సంస్థలు జరిమానాలు కూడా ఎదుర్కొంటున్నాయి. తాజాగా శాఖాహారానికి బదులుగా మాంసాహారాన్ని తప్పుగా డెలివరీ చేసినందుకు ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోతోపాటు రెస్టారెంట్ పార్ట్‌నర్‌ మెక్‌డొనాల్డ్‌లకు రూ.లక్ష ఫైన్ పడింది. అసలు ఏం జరిగిందంటే..?

రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్కు చెందిన ఓ వ్యక్తి జొమాటోలో వెజ్ పిజ్జా మెక్‌డొనాల్డ్స్‌ నుంచి ఆర్డర్ పెట్టాడు. అయితే అతనికి నాన్ పిజ్జాను తీసుకునిఇచ్చాడు డెలవరీ బాయ్. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి కన్జ్యుమర్ కోర్టును ఆశ్రయించాడు. తనకు జరిగిన విషయాన్ని అన్ని ఆధారాలతో అందించాడు.

విచారణ చేపట్టిన జోధాపూర్‌ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్.. వినియోగదారుల ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని ఉల్లంఘించినందుకు జొమాటో, రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్స్‌పై రూ.లక్ష జరిమానా విధించింది.
అదేవిధంగా కేసు ఖర్చుల కింద రూ.5 వేలు జరిమానా కూడా వేసింది. జొమాటో, మెక్‌డొనాల్డ్‌లు సంయుక్తంగా ఈ జరిమానా.. కేసు ఖర్చులను చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డర్‌పై కంపెనీ అప్పీల్‌ను దాఖలు చేయనున్నట్లు జొమాటో స్టాక్ మార్కెట్‌కు ఇప్పటికే తెలియజేసింది. న్యాయవాదుల సలహా మేరకు ఈ ఆర్డర్‌పై అప్పీల్ దాఖలు చేసే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. 

ఈ కేసు శాఖాహార ఆహారానికి బదులుగా మాంసాహార ఆహారాన్ని తప్పుగా డెలివరీ చేయడానికి సంబంధించినదని పేర్కొంది. వినియోగదారులు, కంపెనీ మధ్య సంబంధాన్ని నియంత్రించే సేవా నిబంధనలలో ఈ విషయంపై స్పష్టంగా ఉందని తెలిపింది. ఆహార పదార్థాల విక్రయానికి తాము ఓ వేదిక మాత్రమేనని.. సేవల్లో ఏదైనా లోపం ఉన్నా.. ఆర్డర్‌లను తప్పుగా డెలివరీ చేసినా రెస్టారెంట్‌ బాధ్యత వహిస్తుందని తెలిపింది.

Also Read: Oppo Reno10 Pro+ 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Oppo Reno10 Pro+ 5G మొబైల్‌ రూ. 17,549కే..నమ్మట్లేదా?  

Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News