PM Kisan Scheme: రైతులు పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే కొత్త రూల్స్ ఇవే

PM Kisan Scheme New Rules: రైతులకు భరోసా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన. తాజాగా పీఎం కిసాన్ సమ్మన్ నిధిలో కొత్త నియమాలు తీసుకొచ్చారు. గతంలో వచ్చిన కొందరికి ఈ పథకం ఇకనుంచి వర్తించదని తెలుస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 10, 2021, 03:49 PM IST
PM Kisan Scheme: రైతులు పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే కొత్త రూల్స్ ఇవే

PM Kisan Scheme New Rules: పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ఏటా 3 వాయిదాలుగా మొత్తం రూ.6000ను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి విడుత ఏప్రిల్-జూలై మధ్య కాలానికి, ఆగస్టు-నవంబర్ మరియు డిసెంబర్-మార్చి మధ్య కాలంలో 2, 3వ దఫా నగదు రైతులకు అందిస్తారు. 

ఈ పథకం ద్వారా 11.47 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Samman Nidhi) కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ నగదు పథకం కోసం కొన్ని కొత్త నియమాలు తీసుకొచ్చింది.  ఇకనుంచి పీఎం సమ్మన్ నిధి పథకం ద్వారా ప్రయోజనం పొందాలంలే కొన్ని షరతులు, నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుంది. త్వరలో దీనిపై మరింత స్పష్టత రానుంది.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే నియమాలు ఇవే..
- సాగు చేస్తున్న వ్యవసాయ భూమి ఆ రైతు పేరు మీదనే ఉండాలి. 
- ఆ రైతుల బ్యాంకు అకౌంట్‌కు కచ్చితంగా ఆధార్ నెంబర్‌ లింక్ చేసి ఉండాలి.
- తల్లిదండ్రుల పేరు మీద ఉన్నా, ఇతరుల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని చేస్తున్నా ఇకనుంచి పీఎం కిసాన్ స్కీమ్(PM Kisan Scheme) నగదు రూ.6 వేలు రావు. 

Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్‌లో ప్రకటన
- ప్రతినెలా రూ.10 వేలకు పైగా ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకునే వారు ఇంట్లో ఉన్నా, కుటుంబ సభ్యులు ఎవరైనా రాజ్యంగబద్ధమైన పదవీలో కొనసాగుతుంటే ఆ రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు.
- ఇకనుంచి పీఎం కిసాన్ స్కీమ్ దరఖాస్తులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి, ధ్రువీకరిస్తుంది. దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ నగదు పథకం వర్తించదు.
- ఒకవేళ అర్హులైన లబ్ది చెందే రైతు మరణిస్తే అతడి భార్య లేదా కుమారుడు, కుమార్తె ఖాతాల్లో నగదు జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News