kerala ragging horror incident: ప్రభుత్వాలు ర్యాగింగ్ చేయడం నేరంగా ఇప్పటికే స్పష్టం చేశాయి. ఎవరైన ర్యాగింగ్ లకు పాల్పడితే వారిపై కఠిన చట్టాల కింద కేసుల్ని నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇటీవల ర్యాగింగ్ కు చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. గత నెల కేరళలో 15 ఏళ్ల మిహిర్ అహ్మద్ ఆత్మహత్య దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే కేరళ మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
కేరళలోని కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో కొంత మంది సీనియర్ లు జూనియర్ లపై దారుణానికి పాల్పడ్డారు. ఐదుగురు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కొన్ని నెలలుగా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారు.
వీరిని కాలేజీలో నగ్నంగా నిలబెట్టి.. వీరి ప్రైవేటు పార్ట్ లపై డంబుల్స్ సైతం వేలాడదీసి, కంపాస్ లోని సూదులతో ప్రైవేటు పార్ట్ లను గుచ్చి పైశాచిక ఆనందం పొందారు. బాధితులు బాధతో కేకలు వేస్తుంటే, లోషన్‌ను బలవంతంగా వారి నోటిలోకి పూసేవారు. ఈ ఘటను వీడియోలు తీసి, ఎవరికైన చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
Read more: Ayodhya Chief Priest Satyendra das: అయోధ్య రామాలయం ప్రధాన పూజారీ కన్నుమూత... సంతాపం తెలిపిన మోదీ..
గత కొన్ని నెలలుగా ఈ ఘటన జరుగుతుంది. అయితే.. విద్యార్థులు ఇన్ని నెలలు సీనియర్స్ ఆగడాలను భరించారు. తాజాగా.. కొట్టాయం పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో సెకండ్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులు సామ్యూల్ జాన్సన్, జీవా ఎన్ఎస్ అలాగే మూడో సంవత్సరం విద్యార్థులు రాహుల్ రాజ్, రిజిల్‌జిత్, వివేక్ ఎన్వీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter