Ravindranath Tagore: జనగణమణ గేయ రచయిత, నోబుల్ బహుమతి విజేత విశ్వకవి రవీంద్రుని ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇళ్లు అమ్మకానికొచ్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్(Ravndranath Tagore). జగమెరిగిన కవి. జనగణమంటూ గుండెల్లో దేశభక్తిని రగిలించిన మహనీయుడు. ఎక్కడ నా దేశం స్వేచ్ఛగా మనగలుగుతుందో అంటూ నినదించిన కవి. పశ్చిమ బెంగాల్లో రవీంద్రుని శాంతినికేతన్ అందరికీ సుపరిచితమే. ఆ మహాకవి ఇళ్లు ఇప్పుడు అమ్మాకనికి వచ్చింది. అయితే ఇండియాలో ఇళ్లు కానేకాదు. లండన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ కొంతకాలం నివసించిన గృహమిది. 1912లో గీతాంజలిని ఇంగ్లీషులో అనువదించినప్పుడు కొద్దికాలం లండన్ హాంపస్డెట్ హీత్‌లోని హీత్విల్లాలో నివసించారు. అందుకే ఈ విల్లాకు ప్రాముఖ్యత పెరిగింది.
2015, 2017లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)యూకేను సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ విల్లాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. లండన్‌లోని భారత హై కమీషనర్‌తో చర్చించారు కూడా. ఠాగూర్ నివసించిన ఆ ఇంటిని ఓ మ్యూజియంగా మార్చాలనేది ఆమె కోరిక. వినియోగదారులు అత్యధిక విలువను పొందడమే తమ లక్ష్యమని..బ్రిటీష్ చట్టాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తే తమకే అభ్యంతరం లేదని ఎస్టేట్ ఎజెంట్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ విల్లా కొనుగోలుకు బెంగాల్ ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం(Central government) గానీ ఆసక్తి వ్యక్తం చేయలేదని లండన్‌లోని భారత హైకమీషనర్ తెలిపారు.
Also read: Gautam Gambhir Case: గౌతమ్ గంభీర్ కోవిడ్ మందుల నిల్వ కేసులో స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook