Interesting Facts about Republic Day 2024: జనవరి 26న గణతంత్ర వేడుకలు (Republic Day 2024) జరుపుకోవడానికి దేశం మెుత్తం రెడీ అవుతోంది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా రిపబ్లిక్ డేను జరుపుకుంటారు. ఈ వేడుకలు ఢిల్లీలో జరగనున్నాయి. ప్రతి సంవత్సరం రాజ్‌పథ్‌లో జరిగే కవాతు హైలైట్‌గా నిలుస్తాయి. ఇది దేశ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. రిపబ్లిక్ డే పరేడ్ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోండి.
1) ఇప్పుడు రాజ్‌పథ్‌లో జరుగుతున్న కవాతు మొదట్లో వివిధ ప్రదేశాలలో నిర్వహించేవారు. ఇర్విన్ స్టేడియం (ప్రస్తుతం నేషనల్ స్టేడియం), కింగ్స్‌వే (రాజ్‌పథ్), ఎర్రకోట మరియు రాంలీలా మైదానాల్లో 1955 నుండి ఇది ప్రారంభమైంది.
2) రాష్ట్రపతి రాకతో గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రారంభమవుతుంది. ముందుగా రాష్ట్రపతి అంగరక్షకులు, అశ్వికదళం జాతీయ జెండాకు వందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పక్కనే జాతీయ గీతాన్ని ప్లే చేస్తారు. ఆ తర్వాత 21-గన్ సెల్యూట్ కార్యక్రమం ఉంటుంది.
3) 1950లో ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో భారతదేశ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు మొట్టమొదటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
4) జనవరి 26, 1950న దేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు.
5) గణతంత్ర దినోత్సవ పరేడ్ రాష్ట్రపతి భవన్ నుండి రాజ్‌పథ్ మీదుగా ఇండియా గేట్ వరకు సాగుతోంది. అక్కడ నుండి ఎర్రకోట వరకు వెళ్తుంది. అనంతరం భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళానికి చెందిన అనేక రెజిమెంట్‌లు, వారి బ్యాండ్‌లతో పాటు కవాతు చేస్తాయి. అనంతరం వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే శకటాలను ప్రదర్శిస్తారు.
6) ఈ సంవత్సరం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గతేడాది ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
7) 2024 రిపబ్లిక్ డే పరేడ్ యొక్క థీమ్ "భారత్ - లోక్తంత్ర కి మాతృక" (భారతదేశం - ప్రజాస్వామ్య తల్లి) మరియు "వికసిత్ భారత్" (అభివృద్ధి చెందిన భారతదేశం). ఇది దేశం యొక్క ప్రజాస్వామ్య విలువలు మరియు పురోగతి ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది.
Also read: AAP alone Contest: కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. ఆమ్ ఆద్మీ కూడా బంధానికి బ్రేక్
Also Read: Bharat Bandh: ఫిబ్రవరి 16న భారత్ బంద్.. మోదీ ప్రభుత్వంతో రైతు సంఘాలు తాడేపేడో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook