SP Charan condemned the rumors on MGM Hospital: న్యూఢిల్లీ: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) శుక్రవారం (సెప్టెంబరు 25న) కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు 40 రోజుల క్రితం ఎస్పీ బాలు (SP Balu) కరోనావైరస్ బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం సీనీ, రాజకీయ ప్రముఖులను, గానాభిమానులను తీవ్రంగా కలిచివేసింది. అయితే.. కరోనా (Coronavirus) ను జయించినా..ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇతర సమస్యల కారణంగానే మరణించారని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అయితే ఇప్పుడు బాలు అభిమానులు అంతకుముందు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ.. ఎంజీఎం ఆసుపత్రిపై విరుచుకుపడుతున్నారు. గాన గంధర్వుడు బాలు కోలుకుంటున్నారని, మ్యూజిక్ వింటున్నారని, ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తున్నారని ఆయన కొడుకు చరణ్ చెబుతుంటే.. అందరూ.. బాలు క్షేమంగా తిరిగి వస్తారని చెప్పిన అనతి కాలంలోనే ఆయన మరణవార్త వినాల్సి రావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కొందరు ఎంజీఎం ఆసుపత్రిపై తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డబ్బు కోసమే ఇన్నాళ్లు బాలుని ఆసుపత్రిలో ఉంచి ఇబ్బందులకు గురిచేశారని, ఆయన మరణం వెనుక ఏదో పెద్ద కారణం.. కుట్ర ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ద్వారా పలువురు ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై బాలు తనయుడు ఎస్పీ చరణ్ (SP Charan) క్లారిటీ ఇచ్చారు. అలాంటి వదంతులను వ్యాపింపజేయోద్దంటూ సోషల్ మీడియాలో ఎస్పీ చరణ్ వీడియోను విడుదల చేశారు. Also read: Bharat Ratna to SP Balu: గానగంధర్వుడికి భారతరత్న ఇవ్వాలి: అర్జున్
https://www.facebook.com/watch/?v=322499532387614&extid=jQ5yVShpaqiWYteE
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital) లో చేరిన నాటినుంచి ఆయన చనిపోయే వరకు ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ఎంతో శ్రద్ధ తీసుకున్నారని ఎస్పీ చరణ్ స్పష్టంచేశారు. ప్రతి విషయంలోనూ వారు వెన్నంటే ఉండేవారని.. అలాంటి వదంతులను నమ్మోద్దంటూ ఆయన కోరారు. దీంతోపాటు బాలు ఆరోగ్యంపై తమిళనాడు ప్రభుత్వం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రతిరోజూ అడిగి తెలుసుకునేవారని తెలిపారు. డబ్బు విషయంలో వస్తున్న వదంతులు కూడా నిజం కాదని కొట్టిపారేశారు. తన నాన్నగారిని అభిమానించే వాళ్లు చేసే పని ఇది కాదని, ఇలాంటి సమయంలో ఇలాంటి వదంతులు సృష్టించి తమను బాధపెట్టవద్దంటూ.. వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. Also read : SPB cremated with full state honors: ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి