CJI NV Ramana: శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇందులో ఏది గొప్పంటే అర్ధమే లేదు. కానీ మూడింటికీ సరిహద్దులున్నాయి. ఎవరి హద్దు వారిదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అదే అంటున్నారు.
దేశంలో చాలాకాలం నుంచి వివిధ సందర్భాల్లో శాసన వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ వివాదం రేగింది. ఇంకా అప్పుడప్పుడూ రేగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ ప్రశ్నల్ని మరోసారి సంధించింది. మరోసారి వివాదానికి కారణమైంది. రాజధాని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదంటూ చెప్పడం కొత్త వివాదానికి దారి తీసింది. అసెంబ్లీలో శాసన సభ విస్తృత అధికారాలు, న్యాయ వ్యవస్థ పరిధిపై చర్చకు దారితీసింది.
మూడు వ్యవస్థల అధికారాలు వేర్వేరు
ఇవాళ ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రుల సదస్సులో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని న్యాయమూర్తులు విధి నిర్వహణలో తమ పరిమితుల్ని గుర్తుంచుకోవాలని సూచించారు జస్టిస్ ఎన్వి రమణ. ఆ క్రమంలో లక్ష్మణ రేఖను దాటవద్దని కోరారు. దేశ రాజ్యాంగం..శాసన, కార్య నిర్వాహక, న్యాయ శాఖలకు వేర్వేరు అధికారాల్ని కల్పించిందన్న సంగతి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండేందుకు, సజావుగా సాగేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమౌతున్నాయి. ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇదే జరిగిందనే వాదన ఇప్పటికే ఉంది. హైకోర్టు శాసన వ్యవస్థలో కలగజేసుకుందనే ఆరోపణలొచ్చాయి. ఈ అంశంపైనే ఏపీ అసెంబ్లీలో చర్చ కూడా సాగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ..అదే చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి కాస్త రాను రానూ వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read: India Covid Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ మరణాలు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.