Supreme Court: కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఛీఫ్ జస్టిస్

Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానంపై గౌరవం లేనట్టుంది. సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ చేసిన వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 6, 2021, 05:16 PM IST
  • కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
  • ట్రిబ్యనల్స్ ఖాళీల భర్తీ విషయమై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ
  • నియామకాలు చేయకపోతే మూసేయమని సూచన
Supreme Court: కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఛీఫ్ జస్టిస్

Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానంపై గౌరవం లేనట్టుంది. సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ చేసిన వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి.

ట్రిబ్యునల్స్ ఖాళీల(Tribunal vacancies) భర్తీ విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై (Central government)ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీల్ని భర్తీ చేసే విషయంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ ప్రశ్నించింది. ట్రిబ్యునల్స్ ఖాళీల విషయంలో దాఖలైన పిటీషన్లపై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తక్షణం ట్రిబ్యునల్స్ ఖాళీల భర్తీపై వివరణ ఇవ్వాలంటూ వారం రోజులు కేంద్రానికి గడువు విధించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు అసహనంతో ఉందని..ప్రభుత్వంతో ఇబ్బందికర వాతావరణాన్ని కోరుకోవడం లేదని సూచించారు. ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుతో(Supreme court) ఇబ్బందికర వాతావరణాన్ని కోరుకోవడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 

కేసును సెప్టెంబర్ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు కేంద్రం ముందు మూడు ఆప్షన్స్ ఉంచింది. నియామకాలు చేపట్టడం, ట్రిబ్యునల్స్ పూర్తిగా మూసేయడం, నియామకాలు అవకాశమిచ్చి..కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధపడటం ఆప్షన్స్‌గా ఉన్నాయని తెలిపింది. 

Also read: Google History: గూగుల్ సెర్చ్‌లో తొలిసారిగా వెతికిన ఆ పదమేంటి, గూగుల్ ఎలా పుట్టింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News