Supreme Court JCA Jobs 2025: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తకి శ్రీకారం చుట్టింది. 241 మంది జూనియర్ కోర్టు అసిస్టెంట్ (JCA) పోస్టులు భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 72,000 గరిష్ట వేతనం అందుకుంటారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం ..
జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 లో భాగంగా 241 వేకెన్సీలను భర్తీ చేయనుంది. ఇది డిగ్రీ చదివిన వారికి బంపర్ ఆఫర్. ఫిబ్రవరి 5 వ తేదీ నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రారంభమైంది. చివరి తేదీ మార్చి 8. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.. ముందుగా నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివి ఆ తర్వాత అప్లై చేసుకోవాలి.
సుప్రీంకోర్టు జూనియర్ అసిస్టెంట్ జాబులు పొందాలనుకునే వారు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాదు టైపింగ్ స్పీడ్ కూడా 35 wpm ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండడం అవసరం. ఈ జాబ్స్ కి రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డిస్క్రిప్షన్ పేపర్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టుల ఎంపికైన వారికి ప్రారంభంలో రూ.35,400 తో పాటు ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.
సూప్రీం కోర్టు నోటిఫికేషన్ కు సంబంధించిన పిడిఎఫ్ ను కూడా అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గ్రూప్ 'బి' నాన్ గెజిటెడ్ క్యాటగిరి లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. ఇందులో ఆన్లైన్ ఎగ్జామినేషన్ తో పాటు టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి గరిష్టంగా రూ. 72,000 పైగా జీతం అందుకుంటారు. పోస్టులకు సంబంధించిన వివరాలు అధికారిక వెబ్సైట్ అయిన www. sci.gov.in లో పొందుపరిచారు.
ఇదీ చదవండి : పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. రూ.1,40,000 జీతం, వెంటనే దరఖాస్తు చేసుకోండి..
డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి ఇది అద్భుత అవకాశం. టైపింగ్ కూడా కలిగి ఉండాలి. కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ కలిగి ఉండటం కూడా ముఖ్యం. ఈ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ లో ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ లో ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ ఇతర కేటగిరీలకు చెందిన వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. రాత పరీక్ష పాసైన వారికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహిస్తారు.. ఆ తర్వాత టైపింగ్ స్పీడ్ టెస్ట్ నిర్వహించి చివరగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఇక ఈ సుప్రీంకోర్టు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. ఇందులో జనరల్ ఇంగ్లీష్ 50 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టుకు 25 ప్రశ్నలు ఉంటాయి.. ఈ ఎగ్జామ్ సమయం రెండు గంటల పాటు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1000 రూపాయలు జనరల్, ఓబీసీ వారు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారు మాత్రం రూ.250 చెల్లిస్తే సరిపోతుంది కేవలం ఆన్లైన్ లో మాత్రమే చెల్లించాలి.
ఇదీ చదవండి : బీఎస్ఎన్ఎల్ 300 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర ఎంత తక్కువ తెలిస్తే ఎగిరిగంతేస్తారు.. త్వరపడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.