Supreme court: రిజర్వేషన్లను ఇంకెంత కాలం కొనసాగించాలని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme court: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మరాఠా రిజర్వేషన్ కేసు విచారణ సందర్బంగా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. కొంతమంది సమర్దిస్తుంటే..మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2021, 03:01 PM IST
Supreme court: రిజర్వేషన్లను ఇంకెంత కాలం కొనసాగించాలని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme court: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మరాఠా రిజర్వేషన్ కేసు విచారణ సందర్బంగా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. కొంతమంది సమర్దిస్తుంటే..మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల(Maratha Reservations)కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లను కొనసాగిస్తారని ప్రశ్నించింది. ఉద్యోగాలు, విద్యకు సంబంధించి ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అంతేకాక రిజర్వేషన్లలో ప్రస్తుతం అమలు చేస్తోన్న 50 శాతం పరిమితిని తొలగించాల్సి వస్తే .. తలెత్తే అసమానతలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు విన్పించిన ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ..రిజర్వేషన్ల పరిమితిపై విధించిన మండల్ తీర్పును మార్చాలని కోరారు. ఎందుకంటే మండల్ తీర్పు(Mandal Judgement) 1931 జనాభా లెక్కల ప్రకారం ఉంది. దాంతోపాటు రిజర్వేషన్ కోటాలను పరిష్కరించుకునే అంశాన్ని ఆయా రాష్ట్రాలకు వదిలివేయాలని వాదించారు. 

దీనికి సమాధానంగా..50 శాతం కోటా పరిమితిని తొలగిస్తే ఆ తరువాత తలెత్తే అసమానతల పరిస్థితేంటి? అంతిమంగా మేం ఏం తేల్చాల్సి ఉంది. ఈ అంశంపై మీ వైఖరేంటి? ఇంకా ఎన్ని తరాలపాటు దీన్ని కొనసాగిస్తారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచాయి. రాష్ట్ర ప్రభ్వుతాలు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నాయి అయినా.. వెనుకబడిన సామాజిక వర్గంలో ఏ మాత్రం అభివృద్ధి లేదన్న విషయాన్ని మనం అంగీకరించగలమా అని సుప్రీంకోర్టు(Supreme court) ప్రశ్నించింది. 

అభివృద్ధి జరిగింది  కానీ, వెనుకబడి తరగతులు 50 శాతం నుంచి 20 శాతానికి తగ్గిపోలేదని.. దేశంలో ఇప్పటికీ ఆకలి చావులు కొనసాగుతున్నాయని ముకుల్ రోహత్గీ  ( Mukul Rohatgi) తెలిపారు. ఇందిరా సాహ్నీ తీర్పు పూర్తిగా తప్పని, చెత్తబుట్టలో వేయాలని అనడం లేదన్నారు. ఈ తీర్పు వచ్చి 30 ఏళ్లు దాటిందని..చట్టాలు పూర్తిగా మారాయన్నారు. పెరుగుతున్న జనాభాతో పాటు సమాజంలో వెనుబడిన వర్గాల సంఖ్య  పెరుగుతోందని చెప్పారు. ఇలా  మండల్‌ తీర్పును పునఃసమీక్షించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. మరాఠా కోటా అంశానికొస్తే మహారాష్ట్రలోని ఎంపీలు , ఎమ్మెల్యేలు ఆ వర్గం వారే 40 శాతం వరకూ ఉన్నారని చెప్పారు. ఈ కేసును సోమవారానికి వాయిదా వేశారు. మహారాష్ట్ర( Maharashtra) లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు కోటా మంజూరు విషయాన్ని సమర్దించిన బోంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారిస్తోంది.  

Also read: Domestic flight charges: మరోసారి పెరిగిన దేశీయ విమాన ఛార్జీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News