Delhi CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో అనే ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎం ఎవరనేది ఎంపిక చేసింది. మొదటి నుంచి ప్రధాన రేసులో ఉన్న రేఖా గుప్తానే ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నిర్ణయించి ఆమె పేరును ప్రకటించింది. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. అతిరథ మహారథులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామ్ లీలా వేదికగా రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Also Read: Udhayanidhi Stalin: 'మీ అయ్య డబ్బులు అడగడం లేదు' ప్రధాని మోదీపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. బీజేఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేసులో ఉన్న పర్వేష్ వర్మకు ఉప ముఖ్యమంత్రిగా పదవి కట్టబెట్టనున్నారు. షాలిమార్‌భాగ్ నుంచి రేఖా గుప్తా ఎమ్మెల్యేగా గెలిచారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు మరో ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: YS Sharmila: మాజీ సీఎం జగన్‌కు అంత దమ్ము, ధైర్యం లేదు: వైఎస్ షర్మిల
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని కాషాయ దళం ఓడించింది. 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాలు కొల్లగొట్టి 27 సంవత్సరాల సుదీర్ఘ కాలం అనంతరం ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రమాణస్వీకారానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతుండగా.. పెద్ద సంఖ్యలో ఎన్డీయే కూటమి నాయకులు హాజరు కానున్నారు. దీంతో ఢిల్లీలో కోలాహల వాతావరణం ఏర్పడింది. అయితే ఈ వేడుకకు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారా? లేదా అనేది సందేహంగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.