బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో గత మూడు రోజుల్లో బంగారం ధరలు రూ.2వేలకు పైగా తగ్గడం గమనార్హం. జ్యువెలర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. మిస్ బికినీ ఇండియా విన్నర్ ఫొటో గ్యాలరీ
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో గత మూడు రోజుల వ్యవధిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.2200 రూపాయల మేర తగ్గింది. నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.80 తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,080 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.70 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.39,440కి క్షీణించింది. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర ఈ వారంలో రూ.2150 వేల మేర తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.80 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.43,210కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.70 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.41,940 వద్ద ట్రేడ్ అవుతోంది. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ
కాగా, బంగారం ధరలు దిగొచ్చినా వెండి ధర మాత్రం పెరిగింది. మూడు రోజుల తర్వాత వెండి ధర భారీగానే పుంజుకుంది. అయినా వెండి కేజీ ధర నలభై వేల కిందనే ట్రేడ్ అవుతోంది. 1కేజీ వెండి రూ.460 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.39,940కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.39,940 వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ