OLA services suspended: ఉబర్, ఓలాలో ఆ సర్వీసు రద్దు

కరోనా వైరస్ ఏ రంగాన్ని వదిలిపెట్టడం లేదు. రైలు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. క్యాబ్ సర్వీసుల్లోనూ ఎన్నో ఆంక్షలుంటున్నాయి.

Last Updated : Mar 23, 2020, 11:58 AM IST
OLA services suspended: ఉబర్, ఓలాలో ఆ సర్వీసు రద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. రైలు, విమాన సర్వీసులను సైతం రద్దు చేశారు. ఈ క్రమంలో ప్రయాణికులకు క్యాబ్ సర్వీస్ ప్రత్నామ్నాయంగా ఉంటుంది. అయితే క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయా లేదా అని ఉబర్, ఓలా క్యాబ్ సంస్థలను ట్విట్టర్‌లో పదే పదే అడుగుతున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉబర్, ఓలా క్యాబ్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.  అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పూల్ సర్వీస్, లేక పూల్ రైడ్‌ సదుపాయాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఉబర్ ఇండియా సపోర్ట్ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజులుగా కస్టమర్లు ఇతరులతో క్యాబ్ షేర్ చేసుకునేందుకు అంతగా మొగ్గుచూపడం లేదని, కరోనా భయాలే వీటికి కారణమని పేర్కొంది. సోషల్ డిస్టాన్సింగ్ (సామాజిక దూరం) పాటించాలన్న నిబంధనల కారణంగా క్యాబ్‌లలో కేవలం ఒకే కుటుంబానికి చెందినవారు, లేక మొత్తం క్యాబ్ సర్వీస్ బుక్ చేసుకున్న కస్టమర్లు ప్రయాణించడానికి మాత్రం వీలుంది.  బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone 

ఓలా క్యాబ్ సర్వీసులు కొన్ని చోట్ల నడుస్తున్నాయి. ఓలా క్యాబ్ సర్వీస్ కొనసాగుతుందా లేదా అని నెటిజన్లు అడుగుతున్నారు. మీ యాప్‌లో ఓలా క్యాబ్ అందుబాటులో ఉందా లేదా చూసుకోండి. కొన్ని చోట్ల తమ క్యాబ్ సర్వీసులు యథాతథంగా కొనసాగిస్తున్నామని ఓలా సపోర్ట్ ట్వీట్ చేసింది. ప్రతి కస్టమర్‌కు ఇదే తీరుగా బదులిస్తోంది. అయితే కస్టమర్ ఉన్న ప్రదేశంతో పాటు సమయాన్ని బట్టి క్యాబ్ సర్వీస్ ఉంటుందా లేదా అధారపడి ఉంటుందని తెలిపింది. పూల్ రైడ్, పూల్ సర్వీస్ ఓలాలో కూడా అందుబాటులో లేదని సమాచారం. కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!

కాగా, ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం మార్చి 22న దేశ వ్యాప్తంగా 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ నిర్వహించడం తెలిసిందే. తెలంగాణలో మాత్రం 24గంటల పాటు జనతా కర్ఫ్యూను పాటించారు. ​జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos

బుల్లితెర భామ టాప్ Bikini Photos 

Trending News