Udhayanidhi Stalin: కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా అక్కడి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మేం మీ నాన్న డబ్బులు ఏమీ అడగడం లేదు. మేం భిక్షం అడుక్కోవడం లేదు. నిధులు అనేవి మా హక్కు' అని స్పష్టం చేశారు.
Also Read: KCR Meeting: గాయాల నుంచి కోలుకుని పుంజుకోవాలి.. గులాబీ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు
కొత్త విద్యా విధానం 2020పై డీఎంకే పార్టీ ఆందోళన చేపట్టగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'హిందీని అంగీకరించకపోతే రూ.2,190 కోట్ల నిధులు ఇవ్వం' అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 'మేం భిక్షం అడగడం లేదు. తమిళనాడు విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లించిన పన్నులను మా హక్కుగా మేం అడుగుతున్నాం. మాకు రావాల్సిన నిధులు మేం అడుగుతున్నాం' అని ఉదయనిధి తెలిపారు. 'మేం మా భాష, మా విద్యా హక్కుల కోసం పోరాడుతున్నాం' అని చెప్పారు. 'తమిళనాడు ప్రజలను ప్రేమతో నియంత్రించవచ్చు. కానీ అణచివేయడంతో సాధ్యం కాదు. బీజేపీ ఇది అర్థం చేసుకోవాల్సి ఉంది' అని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరింత ఆలస్యం?
'ఇది ద్రవిడుల ప్రధాన గడ్డ. ఇది పెరియార్ ప్రాంతం. మీరు (బీజేపీ) మమ్మల్ని భయపెడుతారా. తమిళనాడులో అది ఎప్పటికీ జరగదు' అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. త్రిభాష విద్యా విధానాన్ని తాము ఎట్టి పరిస్థితిలో అంగీకరించమని తేల్చి చెప్పారు. 'మేం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. ప్రజాస్వామ్యయుతంగా మా గొంతు వినిపిస్తున్నాం. ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం మా వాదనను పట్టించుకోవాలి' అని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల కన్నా తమిళులకు భాష ముఖ్యమని డీఎంకే యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. కొత్త విద్యా విధానంలో హిందీని బలవంతంగా రుద్దితే తమిళనాడు పిల్లల భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.