Lav Agarwal: కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీకి కరోనా

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కీలక అధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. 

Last Updated : Aug 15, 2020, 06:51 AM IST
Lav Agarwal: కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీకి కరోనా

Health Ministry Joint Secretary tested Covid-19 positive: ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కీలక అధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ( Health Ministry ) జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్‌ ( Lav Agarwal ) సైతం కరోనా బారిన భారిన ప‌డ్డారు. తనకు జరిపిన ప‌రీక్ష‌లో క‌రోనా పాజిటివ్‌గా తేలిందని, హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు లవ్ అగ‌ర్వాల్‌ శుక్రవారం ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. 

తనను కలిసిన స‌హ‌ోద్యోగులు, స్నేహితులు అందరూ క్వారంటైన్‌లో ఉండాలని ఆయ‌న సూచించారు. ఆరోగ్య సిబ్బంది త్వ‌ర‌లోనే కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తారని వెల్ల‌డించారు. కోవిడ్ నుంచి కోలుకుని అంద‌రినీ త్వ‌ర‌లోనే క‌లుస్తాన‌ంటూ ఆయన ట్విట్ చేశారు. Also read: Covid-19: హోంమంత్రి అమిత్ షాకు కరోనా నెగిటివ్

ఇదిలాఉంటే.. గతంలో లవ్ అగర్వాల్ దేశంలో కోవిడ్-19 పరిస్థితులు, లాక్‌డౌన్‌కు సంబంధించి రోజువారీ మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌, నీతి ఆయోగ్ సీఈవోతో సమావేశమయ్యారు. Also read: Health tips: తులసి పాలు తాగితే.. ఈ రోగాలు మటుమాయం

Trending News