Uttar Pradesh: నల్లగా ఉందనే కారణం చెబుతూ..ఒక వ్యక్తి తన భార్యకు తలాక్(triple talaq) చెప్పి విడాకులిచ్చేశాడు. వారి వివాహం(Marriage) జరిగి పట్టుమని తొమ్మిది నెలలు కూడా కాలేదు. అంతలోనే భర్త తలాక్ చెప్పడంతో...బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(UP)లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే...
బరేలీ జిల్లా(Bareilly District)లోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆలం అనే వ్యక్తితో ఈ ఏడాది మార్చి 7న బాధిత మహిళకు వివాహం(Marriage) జరిగింది. పెళ్లి సమయంలో సుమారు 3 ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించారు భర్త, అత్తింటివారు. బాధితురాలి తండ్రి వద్ద మిగిలి ఉన్న భూమిని విక్రయించి రూ.10 లక్షలు తేవాలని, దాంతో కారు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఒత్తిడి చేశారు. అందుకు ఆమె నిరాకరించటంతో ఆమెపై పలుమార్లు దాడికి పాల్పడ్డారు. చివరకు తలాక్(triple talaq ) చెప్పి ఇంటి నుంచి గెంటేయడంతో..బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Also Read: ఆ పనికి ఒప్పుకోలేదని ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన మహిళ
గృహహింస, ముమ్మారు తలాక్(triple talaq case), నల్లగా ఉందని హేళన, రూ.10 లక్షల కట్నం కోసం వేధింపులు వంటి ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజీవ్ సింగ్ తెలిపారు. అన్ని విధాల సాయం చేస్తామని బాధిత మహిళకు హామీ ఇచ్చినట్లు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook