Today Weather: తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల్నించి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మేఘాలు ఆవరించి..వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల వరకూ ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి.
ఓ వైపు రుతు పవనాలు, మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో రానున్న 24 గంటలు వర్షాలు కొనసాగనున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు పడనున్నాయి. తెలంగాణలోని మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాల్లో రానున్న 24 గంటలవరకూ తేలికపాటి జల్లులతో పాటు ఉరుములు మెరుపులు పడనున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఉదయం నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రమంతా మేఘావృతమై ఉంది. వచ్చే 24 గంటలు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక కొంకణ్, గోవా, బీహార్, ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్ , అస్సోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలతో పాటు పిడుగులు పడనున్నాయి.
Also read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడనున్నాయా..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి