బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప శికారపుర నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 24 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి యెడ్యూరప్ప విజయం సాధించడం ఇది ఐదోసారి. తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించడమే కాకుండా సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అసవరమైనన్ని స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతున్నది.
అటు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో సమావేశం కానుంది. బీజేపీకి విజయాన్ని కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలియజేయడంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు, బీజేఎల్పీ సమావేశం తేదీ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ సిఎం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన యెడ్యూరప్ప ఈరోజు సాయంత్రం హస్తినకి బయలుదేరి వెళుతున్నారు. ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో యెడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తారు.
BS Yeddyurappa wins in Shikaripura. In a few hours from now, @BSYBJP will lead a stable and strong BJP government in Karnataka as Chief Minister. Congratulations!
Karnataka has spoken and spoken decisively!#BJPWinsKarnataka
— BJP Karnataka (@BJP4Karnataka) May 15, 2018
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాదామిలో బీజేపీ అభ్యర్థి గాలి సన్నిహితుడు శ్రీరాములుపై ఆధిక్యంలో కొనసాగుతుండగా.. చాముండేశ్వరి స్థానంలో 12వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
పొత్తు అనవసరం: సదానందగౌడ
కర్ణాటకలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, ఇప్పటికే 112 సీట్ల ఆధిక్యంలో ఉన్నామని ఆ పార్టీ నాయకుడు సదానందగౌడ చెప్పారు. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.