Top 10 Anti Ageing Foods: మనం చూస్తూనే ఉంటాం కొంతమంది నటీమణులు ఎన్ని ఏళ్ళు వచ్చినా నిత్య యవ్వనంగా కనిపిస్తారు. దీనికి వారు తమ డైట్లో చేర్చుకునే ఆహారం ప్రధాన కారణం. మన లైఫ్ స్టైల్ బాగుండకపోతే తక్కువ వయసులోనే ముసలితనం వచ్చేస్తుంది. హెల్తీ లైఫ్ స్టైల్ అనుసరిస్తూ కొన్ని రకాల ఆహారాలు డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా సమతుల్య ఆహారం తీసుకోవాలి, అంటే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్ లో చేర్చుకొని హైడ్రేషన్ నిర్వహించాలి.రేడియేషన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. దీంతో మీరు ఎక్కువ కాలం పాటు యవ్వనంగా కనిపిస్తారు.
మీ స్కిన్ కేర్ ఉత్పత్తుల ప్రధానంగా రెటినాయిడ్స్,హైలోరోనిక్ యాసిడ్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఇవి కోల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. దీంతో మీ చర్మ రంగు ఆకృతి మెరుగుపడుతుంది. యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మంపై గీతలు తొలగిపోతాయి. నిత్య యవ్వనంగా కనిపిస్తారు. మీ స్కిన్ టోన్ కూడా మెరుగవుతుంది. డెర్మటాలజిస్టులు సిఫార్సు చేసిన కొన్ని రకాల ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
స్వీట్ పొటాటో..
స్వీట్ పొటాటో ఎన్నో రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో బీటా కెరొటిన్ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. ఇది అల్ట్రా వైలట్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అంతేకాదు స్వీట్ పొటాటో లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగు చేస్తుంది.
గ్రీన్ టీ..
సాధారణ టీ బదులు గ్రీన్ టీ మీ డైట్ లో చేర్చుకోండి ఇందులో కేటాయించి పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటాయి. ఈ ఆహారాలు డైట్లో చేర్చుకోవడం వల్ల మంట, వాపు సమస్య తగ్గిపోతుంది. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు.
టమాటాలు..
టమోటాల్లో కూడా కొల్లాజెన్ ఉత్పత్తికి ప్రేరేపించే గుణాలు ఉంటాయి. ఇందులోని లైకోపీన్ చర్మంపై మంట, వాపు సమస్యను తగ్గించి చర్మ రంగును మెరుగుపరుస్తుంది. అంతేకాదు టమాటాలు యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్.
ఇదీ చదవండి: వాలంటీర్ల వ్యవస్థ ఉంటే కదా రద్దు చేయడానికి: డిప్యూటీ సీఎం పవన్..
ఆకుకూరలు...
ఆకు కూరలో విటమిన్ ఏ, సీ, కే పుష్కలంగా ఉంటాయి. వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా ఆకుకూరలు తినాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఈ విటమిన్స్ కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. ముఖం మంచి స్కిన్ టోన్ మెరుగవుతుంది ఆకుకూరలు అంటే ముఖ్యంగా పాలకూర కాలే వంటివి డైట్లో చేర్చుకోవాలి.
ఫ్యాటీ ఫిష్..
కొవ్వు చేపల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా 6 కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని సాగే గుణం అందిస్తుంది. ముఖంపై గీతలు, మచ్చలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా సాల్మన్, మాకరల్ చేపలు చేర్చుకోవాలి. ఇవి కూడా మీ చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడతాయి.
ఇదీ చదవండి: రైతులకు బిగ్ అలెర్ట్.. ఈ లిస్టులో మీ పేరు ఉంటే.. పీఎం కిసాన్ డబ్బులు రావు..! పూర్తి వివరాలు ఇవే..
గింజలు..
ఉదయం పరగడుపున గింజలు నానబెట్టి తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆక్సిడేటివ్ డామేజ్ కాకుండా కాపాడుతాయి. ఈ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. దీంతో పాటు మీరు ఎక్కువ కాలం మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. ఇవి కాకుండా మరో 5 ఆహారాలు అవకాడో, మష్రూమ్స్,క్యారట్లు, యాపిల్స్, ముఖ్యంగా విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. మొత్తం 10 యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ డైట్లో ఉండాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Anti Ageing Foods: ఈ 10 ఆహారాలతో నిత్య యవ్వనం.. ముఖంపై ఒక్క మచ్చ, గీత కూడా కనిపించడం కష్టం..