Cabbage For Weight Loss: క్యాబేజీ శీతాకాలంలో మార్కెట్ల విచ్చలవిడిగా లభిస్తాయి. ఎందుకంటే శీతల కారణంగా కూరగాలను ఎక్కువగా సాగు చేస్తారు. దీంతో చలి కాలంలో మార్కెట్‌లో ఎక్కువగా కూరగాయలు లభిస్తాయి. అయితే క్యాబేజీ ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా క్యాబేజీలో క్యాల్షియం, ప్రొటీన్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. క్యాబేజీని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది. అంతేకాకుండా శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. అయితే దీనిని అతిగా తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చలికాలంలో క్యాబేజీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం:
>>క్యాబేజీలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా కళ్లకు చాలా రకాలుగా సహాయపడుతుంది.
>>చలికాలంలో క్యాబేజీ తినడం వల్ల కళ్లకు సంబంధించి అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. సులభంగా కంటి చూపు మెరుగుపడుతుంది.
>>ఈ క్యాబేజీని ప్రతి రోజు తినడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
>>క్యాబేజీలో కేలరీలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది.
జీర్ణవ్యవస్థను బలంగా మారుతుంది:
శీతాకాలంలో క్యాబేజీని తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ మొదలైన సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అయితే చలి కాలంలో మలబద్ధకం సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆహారంలో క్యాబేజీని తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
కండరాల దృఢత్వం:
శీతాకాలంలో క్యాబేజీని తినడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే క్యాబేజీలో లాక్టిక్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe