High Cholesterol Risk Factors: కొలెస్ట్రాల్ పెరగడం మన శరీరానికి చాలా ప్రమాదకరం. శరీరంలో ఒక్కసారిగా కొలెస్ట్రాల్ పెరగడం మొదలైతే అది అధిక రక్తపోటు గుండెపోటు మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారకంగా మారుతుంది. అంతేకాకుండా కొంతమందిలో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను గుర్తించి సకాలంలో పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. లేకపోతే పై వ్యాధులకు గురవక తప్పదు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం సర్వసాధారణమైనప్పటికీ చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అనారోగ్యకరమైన ఆహారం:
చాలామంది బిజీ లైఫ్ కారణంగా ఆయిల్ ఫుడ్స్, రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారాలను విచ్చలవిడిగా తింటున్నారు. ఈ ఆహారాలను అతిగా తీసుకోవడం ద్వారానే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
శారీరక శ్రమ:
ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది రోజులో 8 నుంచి 10 గంటలకు కూర్చొని పనులు చేస్తున్నారు దీని వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఇంతకుముందే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పై విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గంటకు ఒకసారి 20 నుంచి 10 అడుగులు నడవాల్సి ఉంటుంది.
ధూమపానం:
ధూమపానం అనేది ఒక చెడు అలవాటు అని మనందరికీ తెలుసు.. అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో ధూమపానం చేస్తూ ఉంటారు. అయితే దీనివల్ల కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏడు కొలెస్ట్రాల్ పెరగడమే కాకుండా ఊపిరితిత్తులపై కూడా తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు మద్యపానం, ధూమపానం మానుకోవడం చాలా మంచిది.
టైప్-2 డయాబెటిస్:
డయాబెటిస్ ఉన్న వారిలో కూడా చెడు కొలెస్ట్రాల్ పరిమాణం సులభంగా పెరుగుతుంది. కాబట్టి వీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంచుకోవడం చాలా మేలు.
గుండె జబ్బు:
ఇంతకుముందే మీ కుటుంబంలో గుండె జబ్బులు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఉంటే.. తప్పకుండా మీరు కూడా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల సమస్యలతో బాధపడేవారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.