Dry Coconut Benefits: మనం తరచుగా పచ్చికొబ్బరిని వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము. ఎందుకంటే కొబ్బరి ఆహారాల రుచిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలామంది నార్త్ ఇండియన్ ఎక్కువగా తీపితో కూడిన వంటల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. పూర్వకాలం నుంచి పచ్చి కొబ్బరితో పాటు ఎండుకొబ్బరిని ఆహారాల్లో వినియోగించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం పచ్చి కొబ్బరిలో ఎన్ని పోషకాలు లభిస్తాయో..ఎండుకొబ్బరిలో కూడా దానికంటే రెట్టింపు పోషకాలు ఉంటాయని వారంటున్నారు.
ప్రతిరోజు ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు చేకూరుతాయి. కొబ్బరి పాలతో పాటు కొబ్బరి నీళ్లలో ఉండే పోషక గుణాలు ఎండుకొబ్బరిలో లభిస్తాయి. కాబట్టి శరీరానికి శక్తినిచ్చేందుకు ఎండుకొబ్బరి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఎండు కొబ్బరిని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక పెంచుతాయి. దీనికి కారణంగా చలి తీవ్రత కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ఎండుకొబ్బరిలో ఫైబర్, మాంగనీస్, కాపర్ వంటి శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మెదడులోని కణాల సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయట. ముఖ్యంగా రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఎండుకొబ్బరిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే పోషక గుణాలు ఐరన్ లోపం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
ఎండు కొబ్బరిని మహిళలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల కంటే ఎక్కువ లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో లభించే ఫైబర్ ఇతర పోషకాలు మహిళల్లో ఎముకల దృఢత్వాన్ని పెంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించి, మలబద్ధకం ఇతర అనారోగ్య సమస్యల బారిన రక్షిస్తాయి.
చాలామంది కడుపులో అల్సర్ల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఎండుకొబ్బరి ఎంతో సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల నుంచి ఉపశమనం కలిగించి శరీరంలోని కొలెస్ట్రాల్ ను కూడా సులభంగా కరిగిస్తుంది. కాబట్టి ఎండుకొబ్బరితో పాటు డ్రై ఫ్రూట్స్ ను లడ్డూల్లా తయారు చేసుకొని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి