Foods For Hypothyroidism: నేటికాలంలో చాలామంది హైపోథైరాయిడిజం సమస్య బారిన పడుతున్నారు. హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు సంభవించే ఒక పరిస్థితి. ఈ హార్మోన్లు మన శరీరంలోని అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. హైపోథైరాయిడిజం లక్షణాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఈ సమస్యను గ్రహించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎంత నిద్రపోయినా కూడా నిద్రలేమిగా అనిపించడం. తినే ఆహారం తగ్గించినప్పటికీ బరువు పెరుగుతూ ఉండటం. ఇతరులకు సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతలో కూడా చలిగా అనిపించడం. చర్మం రుతువులతో సంబంధం లేకుండా పొడిగా ఉండటం. అధికంగా జుట్టు రాలడం. కండరాలు బలహీనంగా మారి, నొప్పులు వెంటాడతాయి. నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలు కలుగుతాయి.
హైపోథైరాయిడిజం లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించండి. కొన్ని పరీక్షలు చేసిన తరువాత మీరు మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు మందులను ఉపయోగించడంతో పాటు హైపోథైరాయిడిజం ను నియంత్రించే ఆహారపదార్థాలను తినాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
హైపోథైరాయిడిజం కోసం తీసుకోవాల్సిన ఆహారాలు:
హైపోథైరాయిడిజం ఉన్నవారు ఆహారంలో కొన్ని నిర్దిష్ట పోషకాలను పెంచడం చాలా ముఖ్యం. ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడతాయి. సముద్రపు ఆహారాలు (చెప్పలు, రొయ్యలు), అయోడిన్ ఉన్న ఉప్పు, పాల ఉత్పత్తులు. అతి ముఖ్యంగా బ్రెజిల్ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుడ్లు, చేపలు తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి మెరుగుగా పనిచేస్తుంది. సూర్యకాంతి, చేప నూనె, గుడ్లు కూడా ఈ సమస్యకు మంచిది. లీన్ మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, బీన్స్, లెంటిల్స్. వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల హైపోథైరాయిడిజంకు చెక్ పెట్టవచ్చు. అలాగే వీటితో పాటు కొన్ని ఆహారపదార్థాలను తీసుకోకుండా ఉడాలి. అందులో బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, కొలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు థైరాయిడ్ గ్రంథిని అడ్డుకోవచ్చు. వీటితో పాటు గోధుమ, బార్లీ, రై వంటి ధాన్యాలలో గ్లూటెన్ ఉంటుంది. టోఫు, సోయా మిల్క్ ను తినడం తగ్గించండి.
గమనిక: ఈ సమాచారం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీరు ఆందోళన చెందుతున్నట్లయితే, తప్పకుండా మీ వైద్యుడిని సంప్రదించండి.
ముఖ్యమైన విషయం: హైపోథైరాయిడిజం చికిత్సకు ఆహారం మాత్రమే సరిపోదు. మీ వైద్యుడు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇదీ చదవండి: Sugarcane Murukku: చెరుకురసం జంతికలు రెసిపీ.. అదిరిపోయే టీ టైమ్ స్నాక్స్ !!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook