Smartphones Ruining Married Couples Lifes: స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగించకుండా జనం నేరుగా ఒకరినొకరు ప్రేమగా, ఆప్యాయంగా పలుకరించుకునే రోజులు ఎప్పుడో పోయాయని అంటుంటాం కదా .. అది నిజమే అని మరోసారి తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పుడు అంతా వర్చువల్ ప్రేమలే. ఇది సాధారణ జనానికే కాదు .. తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్యభర్తలకు కూడా వర్తిస్తుంది అంటే నమ్ముతారా ? ఎందుకు నమ్మకూడదు ? నమ్మాల్సిందే... నమ్మితీరాల్సిందే అంటోంది ' స్విచ్ఛాఫ్ ' పేరిట జరిపిన ఓ పరిశోధన ఫలితం.
ఒకప్పుడు ఖాళీ సమయం దొరికితే చాలు భార్యాభర్తలు సరాదాగా ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేవారు. కేవలం కబుర్లు చెప్పుకోవడం కోసమే ఖాళీ సమయం కోసం పాకులాడే వాళ్లు. ఖాళీ సమయం లేకపోతే సృష్టించుకునే వాళ్లు. కానీ అంతిమంగా ఒకరి సాన్నిహిత్యంలో ఒకరు గడపడానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. రోజులు మారిపోయాయి. దునియా బదల్ గయా .. జమానా బదల్ గయా . వాటితో పాటే జనం లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది.
ఇప్పుడు ఏ మాత్రం తీరిక దొరికినా మనిషి స్మార్ట్‌ఫోన్‌ని విడిచిపెట్టడం లేదు. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే మోజులో పడి భార్యకు భర్త సమయం కేటాయించలేకపోతున్నాడు.. భార్య భర్తకు సమయం కేటాయించలేకపోతోంది. ఇదంతా ఏదో ఊరకే చెబుతున్న విషయం కాదు.. జనం పెట్టుకుంటున్న వాట్సాప్ స్టేటస్ అంతకంటే కాదు.. తాజా అధ్యయనంలో గణాంకాలతో సహా తేలిన వాస్తవం.
సైబర్ మీడియా రిసెర్చ్ అనే సంస్థతో కలిసి చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ వివో చేయించిన ది స్విచ్చాఫ్ పరిశోధనలో తేలిన అంశం ఇది. మోతాదుకు మించి అపరిమితంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న దంపతుల మధ్య అనుబంధాలు చెడిపోతున్నాయట. భారత్ లోని పలు నగరాలు, పట్టణాల్లో 2 వేలకు పైగా స్మార్ట్ ఫోన్ కస్టమర్స్ పై జరిపిన అధ్యయంలో ఈ ఫలితం తేలింది. ఒకరికొకరు సంభాషించుకునేందుకు తీరిక లేనంతగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించడమే అందుకు కారణంగా ఈ సర్వేలో వెల్లడైంది .
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 88 శాతం మంది ఏం చెప్పారంటే.. స్మార్ట్ ఫోన్స్ ని అతిగా వాడటం వల్ల తమ సంసారాలు, అనుబంధాలు కుదేలవుతున్నాయని అంగీకరించారు. పరిశోధనలో తేలిన అంశాల ప్రకారంగా చూస్తే.. స్మార్ట్ ఫోన్స్ వినియోగం విషయంలో స్త్రీ, పురుషుల మధ్య భారీ వ్యత్యాసం కూడా లేకపోవడం గమనార్హం. నిత్యం 4.7 గంటల సమయం స్మార్ట్‌ఫోన్‌తోనే గడిపేస్తున్నట్టు ఈ సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. పొద్దున్నే నిద్ర లేవడంతోనే మొదలయ్యే ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ భార్య, భర్తల మధ్య బంధాన్ని ముక్కలు చేస్తోంది.
ఇది కూడా చదవండి : How To Control Fat: రూపాయి ఖర్చు లేకుండా నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చు..!
ఇది కూడా చదవండి : Cholesterol Diet: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారా..అయితే ఇలా చేయకండి..
ఇది కూడా చదవండి : Apply Lemon On Face: నిమ్మకాయ రసంలో గ్రీన్ టీ ని కలిపి ముఖానికి అప్లై చేస్తే..ఫేస్‌పై స్కిన్ అదుర్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook