Fenugreek For Diabetes: ప్రస్తుతం ఆధునిక జీవన శైలికరణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం, గుండెకు సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణాలు మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పై వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇలా చేసే క్రమంలో పలు రకాల ఆహార నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేటిని ఆహారంగా తీసుకోవాలి:
మెంతికూర గురించి మనందరికీ తెలుసు. మెంతుల్లో శరీరానికి అవసరమైన చాలా రకాల పోషక పదార్థాలుంటాయి. ఇది అనేక రకాల వ్యాధులను తగ్గించడాని సహాయపడుతుంది. ఇందులో ఉండే స్టెరాయిడల్ సపోనిన్ అనే పోషకం చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇందులో కాల్షియం, సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి.
అయితే ఈ మెంతులను ఆహారాలను తయారు చేసుకునే క్రమంలో వాటిలో వినియోగించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మెంతులు యాంటీఆక్సిడెంట్,స్టెరాయిడ్ సపోనిన్ లక్షణాలను అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిల్లో విటమిన్ ఎ, విటమిన్ సిలు అధిక పరిమాణాల్లో ఉంటాయి. కాబట్టి కళ్ళు, చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిక్ రోగులకు మెంతులు ఓ ఔషధంలా పని చేస్తాయి. కాబట్టి వీరు క్రమం తప్పకుండా వీటితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
మెంతుల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు:
మెంతులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యను తొలగించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. మెంతికూరలో ఉండే పీచు చర్మం పొడిబారడాన్ని తగ్గించి చర్మ సమస్యలను దూరం చేస్తుంది. మెంతికూరలో లభించే ప్రోటీన్ ఎముకలను బలపరుస్తుంది. అంతేకాకుండా రాలిపోయే జుట్టును ఆపేలా చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు విరేచనాలు, పొత్తికడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook