Body Pains Home Remedies: ఒళ్లు నొప్పులు చాలా బాధ కలిగిస్తాయి. చాలా మంది తాత్కాలిక ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వైపు మళ్లుతారు. కానీ మందులతో పాటు నొప్పు తగ్గించడానికి మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. వాతావరణం కారణంగా చాలా ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటారు. గాలిలో చల్లదనం పెరగడం వల్ల కండరాలు బిగుసుకుపోవడం, రక్తప్రసరణ మందగించడం వల్ల ఈ నొప్పులు వస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నొప్పుల బారిన ఎక్కువగా పడతారు.
కొంతమంది తీవ్రమైన నొప్పిని అనుభవించినప్పుడు వేగవంతమైన ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ లేదా నొప్పి నివారణ మందులను అధిక మోతాదులో తీసుకుంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు, దీని వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఆరోగ్య సమస్యలు రావచ్చు. శరీర నొప్పులకు తాత్కాలిక ఉపశమనం పొందడం కంటే వాటి మూల కారణాన్ని గుర్తించి శాశ్వతంగా పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. ఎటువంటి దుష్ప్రభావాలు లేని కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. ఈ చిట్కాలు చాలా రకాల నొప్పులకు ఉపశమనం ఇస్తాయి.
అల్లం, దాని అద్భుతమైన ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. నొప్పి నుంచి ఉపశమనం లభించడానికి ఒక సహజ పరిష్కారంగా కూడా ఉపయోగపడుతుంది. యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉండే అల్లం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, నెలసరి నొప్పులతో సహా వివిధ రకాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లంను నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. పసుపు ఒక సుగంధ ద్రవ్యం. మసాలా, దీనిని శతాబ్దాలుగా భారతీయ వంటకాలలో వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దీని తీసుకోవడం వల్ల నొప్పలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదంలో దాల్చిన చెక్కకు గొప్ప స్థానం ఉంది. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాపు వంటి అనేక అనారోగ్యాలకు దీన్ని ఒక సహజ ఔషధంగా ఉపయోగించవచ్చు. దాల్చిన చెక్కలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనె కలపి తాగండి. ఇది ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, జలుబు లక్షణాలకు చక్కటి చికిత్స.
ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క ముక్కలు వేసి మరిగించండి. 5 నిమిషాలు నానిన తర్వాత వడకట్టి తేనె కలిపి తాగండి. ఓట్స్, పెరుగు, స్మూతీలు వంటి ఆహార పదార్థాలలో దాల్చిన చెక్క పొడిని చిటికెడు వేసి రుచి చూడండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి