Gardening Tips: మందారమొక్క ఆకులు పసుపురంగులోకి మారిపోతున్నాయా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Gardening Tips: ప్రతి ఇళ్లలో మందారమొక్క ఉంటుంది. ఈ ప్లాంట్ ఆకులు, పూవులు కూడా హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తారు. వాస్తు పరంగా కూడా మందార మొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 29, 2024, 08:02 AM IST
Gardening Tips: మందారమొక్క ఆకులు పసుపురంగులోకి మారిపోతున్నాయా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Gardening Tips: ప్రతి ఇళ్లలో మందారమొక్క ఉంటుంది. ఈ ప్లాంట్ ఆకులు, పూవులు కూడా హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తారు. వాస్తు పరంగా కూడా మందార మొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.

మందార మొక్క ఆకులు కొన్నిసార్లు పసుపురంగులోకి మారతాయి. చివరగా అవి రాలిపోతాయి. కానీ, మొక్క మొత్తం ఆకులు ఒకదాని తర్వాత మరోటి పూర్తిగా ఆకులు, మొగ్గలు సైతం ఈ రంగులోకి మారి రాలిపోతాయి. దీనివల్ల మొక్క పాడైపోతుంది. ఈ సమయంలో మందార మొక్కను కాస్తు జాగ్రత్తగా చూసుకోవాలి. దీంతో అవి మళ్లీ ఆరోగ్యకరంగా మారి పూలు పూస్తాయి. పచ్చగా గుబురుగా మారుతుంది.

ఇదీ చదవండి: ఈ చిట్కాలతో మైగ్రేన్‌ సమస్య దూరం..! మీరు ట్రై చేయండి

ప్రతిరోజూ మందార మొక్కకు క్రమంతప్పకుండా నీరు పెట్టినా కూడా వాటి ఆకులు పసుపురంగులోకి మారిపోతాయి. దీనికి ప్రధాన కారణం వేళ్ల భాగంలో ఏదైనా సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా ఈ మొక్క వేళ్లు బలహీనంగా మారితే ఇలా వాటి ఆకులు పసుపురంగులోకి మారిపోతాయి.

మందార మొక్కకు నీరు పెట్టడంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మట్టి తడిగా ఉంటే నీరు పెట్టకండి. పూర్తిగా మట్టిలో నీరు లేకుండా ఉంటేనే నీళ్లుపోయండి. లేకుంటే నీరు ఎక్కువైతే కూడా మందార మొక్క ఆకులు ఇలా పసుపు రంగులోకి మారిపోయే ప్రమాదం ఉంది.

నీళ్లు ఎక్కువ అవ్వడం మాత్రమే కాదు నేలలో పూర్తిగా పోషకాలు తగ్గిపోతే కూడా ఈ రంగులోకి మారిపోతాయి. అప్పుడు వెంటనే కంటైనర్ మార్చి చూడండి. వీలైతే మట్టి కూడా మార్చండి. దీంతో ఆకులు మళ్లీ పచ్చగా పూస్తాయి.

అంతేకాదు మట్టిలో అప్పుడప్పుడు అరటితొక్కలతో తయారు చేసిన నీటిని కూడా ఇస్తూ ఉండాలి. దీనివల్ల కూడా ఆకులు తిరిగి పచ్చగా మారతాయి. ఆవుపేడను కూడా ఈ మొక్క ఉన్న మట్టిలో కలిపినా ఆకులు, కాండం దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. 

ఇదీ చదవండి: వేడి వేసవికి చల్లని ఊరటని ఇచ్చే రూహ్ అఫ్జా షర్బత్

అయితే, ఈ మొక్కకు సన్ లైట్ కూడా ముఖ్యం. సూర్యరశ్మి తక్కువగా ఉన్న ప్రదేశంలో మొక్కను ఏర్పాటు చేసుకుంటే ఇలా పసుపురంగులోకి మారడం మాత్రమే కాదు, మొక్క ఎదుగుదల కూడా కుంటుపడుతుంది. అందుకే మందార మొక్కను ప్రత్యక్ష కాంతిలో ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఎండాకాలంలో నీరు ఎక్కువశాతం ఇచ్చేలా చూడండి. అంటే మొక్క అడుగు భాగం మట్టి నీరు లేకుండా ఎండిపోతే మళ్లీ నీరు పోయండి. ఇలా మందార మొక్కకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాటి ఆకులు పసుపు రంగులోకి మారకుండా చూసుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News