Bone Health: డైట్‌లో ఈ పదార్ధాలుంటే వయస్సు 60 దాటినా ఫిట్ అండ్ స్లిమ్

Bone Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. బాడీ ఫిట్‌గా లేకుంటే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. బాడీ ఫిట్‌గా ఉండాలంటే కేవలం వ్యాయామం ఒక్కటే కాదు..ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా అవసరం. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2023, 04:21 PM IST
Bone Health: డైట్‌లో ఈ పదార్ధాలుంటే వయస్సు 60 దాటినా ఫిట్ అండ్ స్లిమ్

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో..ఫిట్‌నెస్ కోసం ఎముకలు బలంగా ఉండటం అంత అవసరం. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనమౌతుంటాయి. అయితే ప్రతిరోజూ డైట్‌లో  కొన్ని పదార్ధాలు ఉండేట్టు చూసుకుంటే..60లో కూడా ఎముకలు బలంగా ఉంటాయి..

మెరుగైన ఆరోగ్యం, బాడీ ఫిట్‌నెస్ చాలా అవసరం. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది. సాధారణంగా వయస్సు పెరిగేకొద్దీ శరీరంలోని ఎముకలు బలహీనమౌతుంటాయి. దీనికి కారణం కాల్షియం లోపం. అందుకే కాల్షియం తగినంతగా లభించే పదార్ధాలు తరచూ తీసుకోవాలి. దీనివల్ల ఎముకలు బలంగా మారతాయి. ఎముకల పటిష్టత కోసం ఏం తినాలో చూద్దాం..

నవ్వులు బలవర్ధకమైన పోషక పదార్ధాల్లో ఒకటి. ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా వీటీని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా బాడీ పెయిన్స్ వంటివి దూరమౌతాయి. 

ఇక డ్రై ఫ్రూట్స్ విషయంలో..నట్స్, అంజీర చాలా ముఖ్యమైనవి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజువారీ డైట్‌లో వీటిని చేర్చితే మంచి ఫలితాలుంటాయి. 

కూరగాయల విషయానికొస్తే..ఆకుకూరలు చాలా ముఖ్యం. ఇందులో పుష్కలంగా ఉండే పోషక పదార్ధాల వల్ల ఎముకలు పటిష్టంగా మారతాయి. తోటకూర, పాలకూరతో పాటు కాలిఫ్లవర్, బ్రోకలీ కూడా ఇందుకు దోహదపడతాయి.గ్రీన్ వెజిటబుల్స్ లో బీన్స్ చాలా మంచిది. ఇవి తినడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. బీన్స్‌లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషక పదార్ధాలు మెండుగా ఉన్నాయి. బీన్స్‌ను మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే ఎముకలు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. మీ వయస్సు 60కు చేరినా ఎముకల్లో పటుత్వం తగ్గదు.

Also read: How To Control Diabetes: ఈ 3 సింపుల్‌ టిప్స్‌తో మధుమేహం వ్యాధికి బైబై చెప్పొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News