/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Health Tips: benefits of jaggery tea: న్యూఢిల్లీ: ఒత్తిడికి గురైనప్పుడు, అలసిపోయినప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు, తలనొప్పి, ఇతర అనారోగ్యం బారిన పడినప్పుడు, సాధారణ పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ టీ (tea) తాగుతారు. ఇక ఛాయ్ ప్రియుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకు ఐదు కప్పులకు పైగానే చాయ్‌ను తాగుతారు. అయితే టీలో షుగర్ ఉండటం వల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందుతాయి. దీంతో బరువు అధికంగా పెరుగుతుంది. అయితే టీలో చక్కెరకు బదులుగా బెల్లం (Jaggery) ను చేర్చుకుంటే అధిక బరువు ముప్పు నుంచి తప్పించుకోవడంతోపాటు పలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు. అవేమిటో ( Health Tips ) ఇప్పుడు తెలుసుకుందాం.

Jaggery tea: బెల్లం టీ ప్రయోజనాలు

మలబద్దకంతో బాధపడేవారికి బెల్లం ఎంతో మేలు చేస్తుంది. టీలో బెల్లంను (Jaggery tea) చేర్చడం వల్ల జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జీర్ణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఐరన్‌తో రక్తహీనత సమస్య నుంచి కూడా మనం బయట పడవచ్చు. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా బెల్లం కాలేయాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపుతుంది. 

Jaggery tea: బెల్లం టీ ప్రయోజనాలు
టీలో బెల్లంతోపాటు కొద్దిగా అల్లంను కూడా చేర్చుకుంటే శరీర రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. జలుబు, దగ్గు, అలర్జీ, ఫ్లూ లాంటివి తగ్గుతాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ చేసే నష్టాన్ని చాలావరకు తగ్గిస్తాయి. Also read: Wearing Face Mask Issues: ఫేస్ మాస్కు ధరిస్తే నిజంగానే ఈ సమస్యలు వస్తాయా?

 

Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Section: 
English Title: 
Health Tips: benefits of jaggery tea
News Source: 
Home Title: 

Jaggery tea: బెల్లం టీ ప్రయోజనాలు తెలుసా..?

 Jaggery tea: బెల్లం టీ ప్రయోజనాలు తెలుసా..?
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Jaggery tea: బెల్లం టీ ప్రయోజనాలు తెలుసా..?
Publish Later: 
No
Publish At: 
Friday, November 27, 2020 - 06:46