Refrigirator close to wall: మన అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ ఒక ముఖ్యమైన ఉపకరణం. ఇందులో మనం వండిన ఆహారపదార్థాలు, కూరగాయలు వంటివి నిల్వ చేసుకుంటాం. అయితే, నిజానికి కొంతమంది రిఫ్రిజిరేటర్‌ను ఇంట్లో ఏదో ఒక మూల గోడలకు చాలా దగ్గరగా ఉంచుతారు. ఇలా చేయకూడదు. మీరు రిఫ్రిజిరేటర్‌ను గోడకు చాలా దగ్గరగా ఉంచినట్లయితే, అది చాలా నష్టాలను కలిగిస్తుంది. మీరు కూడా ఈ పొరపాటు చేస్తే ఫ్రిజ్‌ని ఇలా ఉంచడం వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.
గోడకు నష్టం..
ఫ్రిడ్జ్ ను ఎప్పుడూ గోడకు దూరంగా ఉండేలా చూసుకోండి. మీరు రిఫ్రిజిరేటర్‌ను గోడకు దూరంగా ఉంచకపోతే దాని నుండి వెలువడే వేడి గోడను వేడి చేస్తుంది. ఈ కారణంగా గోడపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఫ్రిడ్జ్ ను ఎలాంటి రకం గోడల పక్కన దగ్గరగా ఉంచకూడదు. కాస్త దూరంగా ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసుకోండి.
శీతలీకరణంపై ప్రభావితం..
అంతేకాదు ఇలా రిఫ్రిజిరేటర్‌ను గోడకు దగ్గరగా ఉంచడం వల్ల దాని వెనుక గాలి ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది కంప్రెసర్‌పై భారాన్ని పెంచుతుంది. చల్లబరచడం కష్టతరం చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ లు పేలిన కేసులు కూడా బాగానే ఉన్నాయి. అంతేకాదు ఇలా గోడకు దగ్గరగా ఫ్రిజ్ ను పెట్టుకుంటే రిఫ్రిజిరేటర్ లోపల ఉంచిన ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. కంప్రెసర్‌పై లోడ్ పెరగడం వల్ల మీ విద్యుత్ బిల్లు కూడా పెరగవచ్చు.
ఫ్రిజ్ పనిచేయకపోవడం ..
ఫ్రిడ్జ్ గోడకు దగ్గరగా ఉంచినట్లయితే రిఫ్రిజిరేటర్‌పై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. రిఫ్రిజిరేటర్ ఫ్యాన్ ,మోటారు పాడైపోవచ్చు. రిఫ్రిజిరేటర్ జీవితకాలం కూడా తగ్గొచ్చు. ఫ్రిజ్ ,గోడ మధ్య కనీసం 15 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అయితే, ఫ్రిజ్‌పై నేరుగా సూర్యకాంతి పడకూడదని గుర్తుంచుకోండి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook