Budget 2025: భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. బడ్జెట్ లో సామాన్యులపై కేంద్రం వరాల ఝల్లు..

Budget 2025: 2025-26 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. వేతన జీవులతో పాటు సామాన్యులు, రైతులు, పేదలతో పాటు మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు భారీగా తగ్గనున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 1, 2025, 12:45 PM IST
Budget 2025: భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. బడ్జెట్ లో సామాన్యులపై కేంద్రం వరాల ఝల్లు..

Budget 2025: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో సారి లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు క్రియేట్ చేశారు. 2025-26 బడ్జెట్ లో ముఖ్యంగా లిథియం బ్యాటరీలపై భారీగా పన్నులు తగ్గిస్తున్నట్టు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడం విశేషం. లిథియం అయాన్ బ్యాటరీలపై టాక్సులు తగ్గించడం వల్ల ఎలక్ట్రికల్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఓ రకంగా మిడిల్ క్లాస్, పేదలు దీనివల్ల భారీగా లబ్ది పొందనున్నారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం  ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు అనేక పథకాలను అమల్లోకి తెచ్చింది.వాటిని మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి  నిర్మల సీతారామన్  ప్రకటించారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఎలక్ట్రిక్ వెహికల్  బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహాకాల కోసం క్లీన్‌టెక్‌ మిషన్‌ పథకం ప్రవేశ పెట్టారు. మరో 120 రూట్లలో ఉడాన్‌ పథకం అమలు చేయనున్నారు. పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించనున్నారు.  రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.  ఇన్సూరెన్స్ సెక్టార్ లో 74 శాతం ఉన్న ‌ ఎఫ్ డీఐలను వంద శాతానికి నుమతి ఇస్తూ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  ప్రీమియం మొత్తాన్ని దేశంలోనే పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకు అనుమతుల ఇచ్చారు.మరోవైపు వేతన జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన చేసారు. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని  రూ.12 లక్షలకు పెంచారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి  అమల్లోకి రానుంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News