Tasty Chicken Dosa: దోశలు అంటే ఇష్టం లేనివారు ఎక్కువ ఉండరు. సౌత్ ఇండియాలో దోశను బ్రేక్‌ఫాస్ట్ లో తీసుకుంటారు. వీటిని రకరకాలుగా తయారు చేసుకుంటారు. సెట్ దోశ, మసాలా దోశ అని రకరకాలుగా తయారు చేసుకుని తింటారు. అయితే ఎప్పుడైనా చికెన్ దోసను టెస్ట్ చేశారా ఇందులో ఆనియన్, టమాట ఇతర మసాలాలు వేసుకొని తయారు చేసుకుంటారు. ఇది బ్రేక్ ఫాస్ట్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. లంచ్ లో కూడా అదిరిపోతుంది. చికెన్ దోశ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది టమాటా చట్నీ, కోకోనట్ చట్నీ తో తీసుకుంటే అదిరిపోతుంది
కావలసిన పదార్థాలు..
చికెన్ (కీమా) -1/2kg
ఆనియన్స్ -2
కారంపొడి -1 tbsp
నల్ల మిరియాలు -1/2 tbsp
జీలకర్ర -1 tbsp
అల్లం పేస్ట్ -1 tbsp
నూనె -2 tbsp
కరివేపాకు కొద్దిగా..
టమాటా ప్యూరీ -1/2 కప్పు
పసుపు 1/2 tbsp
గరం మసాలా- 1/2 tbsp
గార్లిక్ పేస్ట్ -1 tbsp
కొత్తిమీర కొద్దిగా
ఉప్పు రుచికి సరిపడా
దోశ బ్యాటర్
చికెన్ దోస తయారీ విధానం..
ప్రెజర్ కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు అల్లం పేస్టు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్న ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా ప్యూరీ కారం పసుపు, మిరియాల పొడి, గరం మసాలా రుచికి తగిన ఉప్పు కూడా వేసి ఒక నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఇదీ చదవండి: జోజోబ ఆయిల్ మీ తలకు మసాజ్ చేస్తే 5 మిరాకిల్స్ జరుగుతాయి..
ఇప్పుడు ఇందులో చికెన్ కీమాను కూడా వేసుకొ నీ బాగా కలిపి నీళ్లు తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కూడా ఏమైనా నీళ్లు మిగిలితే మరో రెండు నిమిషాల పాటు ఎక్కువ మంట పెట్టి నీళ్ళు పోయేవరకు కలుపుకోవాలి. అందులోనే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఈ 7 తింటే నిత్య యవ్వనం.. ఈరోజు నుంచి తిని చూడండి..
స్టవ్ ఆన్ చేసి దోశ తవ్వ పెట్టి దోశ వేసుకోవాలి. రెండు వైపులా దోశను కాల్చుకోవాలి. ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి దోశలో ఉడికించుకున్న చికెన్ కర్రీ ను కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఎంతో టెస్ట్ అయిన చికెన్ దోస రెడీ అవుతుంది. దీని కొబ్బరి చట్నీ తో తింటే రుచి అదిరిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి