How To Reduce Cholesterol With Lemon Grass Tea: ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవన శైలి పాటించడమేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎక్కువగా అయిల్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా మందిలో గుండెపోటు, మధుమేహం, కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రాణాలు రక్షించుకోవడానికి పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
ఈ తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ప్రతి రోజూ లెమన్ గ్రాస్ టీలు తాగాల్సి ఉంటుంది. ఈ టీని ప్రతి రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్, బీపీని కూడా సులభంగా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
లెమన్‌గ్రాస్‌లో లభించే పోషకాలు
లెమన్‌గ్రాస్ టీలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఎ, కాపర్, జింక్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి ఈ టీని ప్రతి రోజూ తాగడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
కొలెస్ట్రాల్, బీపీ, కిడ్నీ వ్యాధిలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ టీని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధులైన డిప్రెషన్, నిద్రలేమి, ఊబకాయం, ఉబ్బసం, క్యాన్సర్ సమస్యలు రాకుండా శరీరాన్ని సంరక్షిస్తుంది.
లెమన్ గ్రాస్ టీని ఎలా తయారు చేయాలో తెలుసా?
లెమన్‌గ్రాస్ టీ సిద్ధం చేయడానికి, ముందుగా ఒక చెంచా సన్నగా తరిగిన లెమన్‌గ్రాస్‌ను తీసుకుని, దానిని ఒక కప్పు నీటిలో కలిపి 10 నిమిషాలు మరిగించాలి. అందులోనే అల్లం తురుము వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత కప్‌లోకి తీసుకుని ప్రతి రోజూ రెండు సార్లు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా శరీర బరువు కూడా తగ్గుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్
Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్.. యాంకర్ జబర్దస్త్ రిప్లై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook