Skin Care: ముఖంపై మొటిమలతో టెన్షన్ పడుతున్నారా..?.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

Health Tips: చాలా మంది ముఖంపై మొటిమలతో తెగ ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా యుక్త వయసు రాగానే హర్మోన్ల అసమానతలతో ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. కొందరికి ఇవి ఎర్రగా కూడా కన్పిస్తుంటాయి. వీటిని ముట్టుకుంటే భరించలేని నొప్పి గా ఉంటుంది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 3, 2024, 03:16 PM IST
  • - టీనేజ్ లో ముఖంపై మొటిమలు వస్తుంటాయి
    - జంక్ ఫుడ్ ను అవాయిడ్ చేస్తుండాలి
    - ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి
Skin Care: ముఖంపై మొటిమలతో టెన్షన్ పడుతున్నారా..?.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

Follow These Tips And Remove Pimples: టీనేజ్ గా రాగానే శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలలో హర్మోన్లలో మార్పులు వస్తుంటాయి. దీంతో కొందరిలో ముఖంలో అనేక మార్పులు వస్తాయి. అప్పటి దాక క్యూట్ ఉన్న ముఖంమీద దద్దుర్లు మాదిరిగా పింపుల్స్ కన్పిస్తాయి. కొందరు దీన్ని ఏజ్ ఫ్యాక్టర్ అని లైట్ గా తీసుకుంటారు. మరికొందరు మాత్రం తెగ టెన్షన్ పడిపోతుంటారు.

మొటిమలు తగ్గడానికి స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటారు. అంతేకాకుండా.. మార్కెట్ లో ఉన్న ప్రాడక్ట్స్ అని ముఖానికి పెట్టుకుంటారు. ఎలాగైన మొటిమలు తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతారు. అయితే... ఇంటి నుంచి బైటకు వెళ్లినప్పుడు ముఖంపై స్కార్ఫ్ కప్పుకుని వెళ్లాలి. ముఖంను అనేక సార్లు నీటితో శుభ్రం చేసుకుంటు ఉండాలి. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక.. ముఖం ను చల్లని నీటితో కడుక్కొవాలి.

ఆ తర్వాత వేడినీళ్లతో కాపడం పెట్టుకోవాలి. దీంతో బ్లాక్ హెడ్స్ వెళ్లిపోతాయి. మన శరీరానికి సరిపోయే సోప్ ను మాత్రమే ఉపయోగించాలి. బైటి జంక్ ఫుడ్స్, స్పైసీ పదార్థాలకు దూరంగా ఉండాలి. మంచి ఫుడ్ తీసుకొవాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. ఎక్కువగా ముఖానికి అదే పనిగా చేతితో ముట్టుకోకూడదు.

టెన్షన్ ను వీలైనంతా అవాయిడ్ చేయాలి. ఎలోవీరా జెల్ ముఖానికి పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. పాల మీగడ, నెయ్యి, తెనె కలిపి ముఖానికి అప్లై చేసి కాసేపయ్యాక కడుక్కొవాలి. ముల్తానీ మిట్టి పెట్టుకున్న కూడా ఫెస్ అందంగా మెరుస్తూ కన్పిస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News