Vitamin E Oil Benefits: పిగ్మంటేషన్ సహా చర్మ సమస్యలన్నింటినీ మాయం చేసే అద్భుతమైన ఫేస్‌క్రీమ్

Vitamin E Oil Benefits: విటమిన్ ఇ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. విటమిన్ ఇ ఆయిల్‌లో ఉండే పోషక పదార్ధాలతో చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పిగ్మంటేషన్ సమస్య ఇట్టే దూరమౌతుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 25, 2022, 09:33 PM IST
Vitamin E Oil Benefits: పిగ్మంటేషన్ సహా చర్మ సమస్యలన్నింటినీ మాయం చేసే అద్భుతమైన ఫేస్‌క్రీమ్

చలికాలం వస్తూనే చర్మం డ్రైగా మారిపోతుంటుంది. ఫలితంగా చర్మంపై దురద, రెడ్డిష్‌నెస్ సమస్య అధికమౌతుంది. అందుకే చలికాలంలో చర్మానికి డీప్ నరిష్మెంట్ చాలా అవసరం. అదెలాగో చూద్దాం..

చలికాలంలో ఎదురయ్యే ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు విటమిన్ ఇ ఫేస్‌క్రీమ్ కీలకంగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ ఆయిల్‌లో ఉండే పోషకాలతో చర్మానికి చాలా ఉపయోగాలున్నాయి. విటమిన్ ఇ ఆయిల్ తీసుకోవడం వల్ల చర్మానికి అంతర్గత పోషకాలు లభిస్తాయి. ఫలితంగా చర్మం మృదువుగా, మెత్తగా మారుతుంది.

మరోవైపు విటమిన్ ఇ ఆయిల్ చర్మంపై ముడతలు, హైపర్ పిగ్మంటేషన్ సమస్యను తొలగిస్తుంది. అంతేకాకుండా విటమిన్ ఇ చర్మాన్ని రెజ్యువనేట్ చేయడంలో దోహదపడుతుంది. విటమిన్ ఇ ఫేస్‌క్రీమ్ ఎలా చేయాలంటే..

How to make vitamin E face cream
విటమిన్ ఇ ఫేస్‌క్రీమ్ ఎలా చేయాలంటే

3 లార్జ్ స్పూన్స్ కోకో బటర్, 4 లార్జ్ స్పూన్స్ వర్జిన్ కొబ్బరి నూనె, 1 స్మాల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, 3-4 డ్రాప్స్ ల్యావెండర్ ఎస్సేన్షియల్ ఆయిల్ అవసరమౌతాయి.

ముందుగా కోకో బటర్, వర్జిన్ కొబ్బరి నూనె ఆయిల్ తీసుకుని.. బాయిలర్‌లో వేసి బాగా మరగబెట్టి కలపాలి.ఆ తరువాత స్టౌవ్ ఆపేయాలి. కాస్సేపు చల్లారనివ్వాలి. ఆ తరువాత ఇందులో ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, విటమిన్ ఇ ఆయిల్ వేసి కలపాలి. మొత్తం ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వేసి ప్లాస్టిక్ ర్యాప్‌తో చుట్టాలి. దాదాపు 30 నిమిషాల వరకూ ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత గ్లాస్ కంటెయినర్‌లో వేసి స్టోర్ చేసుకోవాలి. విటమిన్ ఇ ఫేస్‌క్రీమ్ తయారైనట్టే.

Also read: Health Tips: ఈ నాలుగు రకాల టీలు తాగితే చాలు..డయాబెటిస్, కొలెస్ట్రాల్ పూర్తిగా అదుపులో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News