Rid of Lizards: మన ఇళ్లలలో బల్లులు తిరగడం సర్వసాధారణమే. అయితే బల్లులు అంటే చాలా మందికి భయం. అందుకోసం అనేక చిట్కాలను వాడుతుంటారు. అయితే బల్లులు విషపూరితమైనవి కాబట్టి.. వాటిని ఇంట్లోకి రాకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, మీ ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైతే ఈ పరిష్కార మార్గాలను తెలుసుకోండి.
మిగిలిన ఆహారాన్ని పారేయండి!
బల్లులు మీ ఇంటికి రాకుండా ఉండాలంటే ముందుగా మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రుళ్లు మిగిలిన ఆహారాన్ని కిచెన్ లో ఉంచకుండా.. డస్ట్ బిన్ లో వేయోచ్చు. అంతే కాకుండా ఇంట్లోని అన్ని ప్రదేశాలు, మూలల్లో చెత్తచెదారం లేకుండా జాగ్రత్త వహించాలి.
ఎర్ర మిరపకాయతో..
బల్లులను ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఎర్రని మిరపకాయలను ఉపయోగిస్తారు. మీ ఇంట్లో పచ్చి మిరపకాయ లేదా రెడ్ చిల్లీ సాస్ ఉంటే.. దానిని స్ప్రే గా కలిపి బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో చల్లాలి. దాని వల్ల బల్లులు ఇంట్లోకి రావు.
నల్ల మిరియాల కషాయం..
వంటిట్లో ఉండే నల్ల మిరియాలతో బల్లుల నివారణ చేసుకోవచ్చు. నీటిలో నల్లని మిరియాలను పొడి వేసి.. స్ప్రేగా చల్లడం వల్ల బల్లులు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు.
కర్పూరం లేదా నాఫ్తలీన్ గుళికలు..
ఇంట్లోని మూలల్లో కర్పూరం లేదా నాఫ్తలిన్ గుళికలను ఉంచడం వల్ల వాటి వాసనకు బల్లులు ఇంట్లోకి ప్రవేశించవు. కిచెన్ మూలల్లో, సింక్ కింద, ఫ్రిజ్ వెనుక, అల్మారాలు, కిటికీలు ఉంటాయి. కానీ, వీటిని ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి.
ఉల్లిపాయ, వెల్లుల్లి..
ఇంట్లోకి బల్లులుల రాకుండా ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు లేదా కోడిగుడ్డు పెంకులు ఉంచితే మంచిది. వాటి ఘాటైన వాసనకు బల్లులు ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేయవు.
Also Read: Coconut Oil Benefits: కొబ్బరి నూనె వినియోగంతో ముఖసౌందర్యం మరింత మెరుగవుతుంది!
Also Read: Hair Loss Treatment: జుట్టు రాలే సమస్యను దూరం చేసుకునేందుకు హెర్బల్ వాటర్ తప్పనిసరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.