Skin Care: ఎలాంటి ఖర్చులు లేకుండా మీరు యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? ఈ చిట్కాతో సాధ్యం!

Aloe Vera Gel Can Cure Skin Problems: చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ ఫేస్‌ మాస్క్‌లు వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 04:24 PM IST
Skin Care: ఎలాంటి ఖర్చులు లేకుండా మీరు యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? ఈ చిట్కాతో సాధ్యం!

Aloe Vera Gel Can Cure Skin Problems: ప్రస్తుతం చాలా మంది యవ్వనంగా కనిపించేందుకు రకరకాల స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇందులో చాలా రకాల రసాయాలను ఉండడం వల్ల తీవ్ర చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది మొటిమల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీని కోసం కలబంద ఆకులతో పాటు, జెల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల కాంతి వంతమైన, యవ్వనమైన చర్మాన్ని పొందొచ్చఓ ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ చిట్కాలతో యవ్వమైన చర్మాన్ని పొందొచ్చు:
1. కలబంద, రోజ్ వాటర్:

కలబంద, రోజ్ వాటర్ మిశ్రమం వినియోగించడం వల్ల ముఖంపై దద్దుర్లు, దురద నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చర్మ పై అలెర్జీ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
2. అలోవెరా,పెరుగు:
అలోవెరా జెల్‌, పెరుగు మిశ్రమాన్ని ముఖంపై చర్మానికి వినియోగిస్తే..చాలా రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో ప్రోబయోటిక్స్ లక్షణాలు లభిస్తాయి.  కాబట్టి ముఖంపై చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అలోవెరా,పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై దద్దుర్లను దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. 

3. కలబంద, తేనె:
కలబంద, తేనె మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇది చర్మానికి తేమను అందించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ముఖంపై పచ్చలతో పాటు..ముడతలు, పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News