Skin Care Tips at Home: ప్రతి ఒక్కరూ యవ్వనంగా, అందంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. మారుతున్న వాతావరణం కారణంగా చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం చాలా మంది ముఖం గ్లో మెయింటెయిన్ చేయడానికి వివిధ రకాల చిట్కాలను వినియోగిస్తున్నారు. అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టోనర్:
ముఖ సౌందర్యం కోసం టోనర్‌ని తప్పకుండా ఉపయోగించాలి. టోనర్‌ను అప్లై చేసేటప్పుడు, కాటన్ ప్యాడ్‌ని ఉపయోగించి ముఖం, మెడపై సున్నితంగా రుద్దండి. ఇది చర్మం సహజ pH స్థాయిని సరిచేస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
మేకప్:
మహిళలు నిద్రపోయే ముందు ముఖం కడుక్కున్న తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్‌ను తరచుగా ఉపయోగిస్తారు. అయితే ఇది ముఖ చర్మానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖానికి కూడా కాస్త విశ్రాంతి అవసరం కాబట్టి రాత్రి పూట విశ్రాంతిని ఇవ్వడం చాలా మంచిది. నిద్ర పోయే సమయంలో చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి.
ముఖంలాగే చేతులు కూడా..:
ముఖంలాగే చేతులకు కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందమైన చేతులకు హ్యాండ్ క్రీమ్ వాడాలి. దీని కోసం ముందుగా గోరువెచ్చని నీరును తీసుకుని సబ్బు చేతులకు రాసుకుని తేలికపాటి చేతులతో మర్దన చేసుకోండి.
జుట్టు:
పడుకునేటప్పుడు ఎప్పుడూ ఓపెన్ హెయిర్‌తో నిద్రపోకండి. తరచుగా మహిళలు నిద్రపోయే ముందు జుట్టును తెరిచి నిద్రపోతారు. అటువంటి పరిస్థితిలో ముఖం జుట్టు ఆయిల్, మురికి వల్ల ప్రభావితమవుతుంది. దీంతో మొటిమలు వంటి సమస్యలు వస్తాయి.
Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook