Tomato Upma Recipe: టమాటో ఉప్మా.. పిల్లలు లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు..

Tomato Upma Recipe In Telugu: ఎప్పుడైనా ఇంట్లోనే టమాటో ఉప్మా ట్రై చేశారా? అయితే ఈరోజు ఆంధ్ర స్టైల్ టమాటో ఉప్మాను ఇప్పుడే ఇలా ట్రై చేయండి. దీనిని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టమాటో ఉప్మా తయారీ విధానం, కావలసిన పదార్థాలు పూర్తి వివరాలు ఇవే..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 19, 2025, 12:36 PM IST
Tomato Upma Recipe: టమాటో ఉప్మా.. పిల్లలు లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు..

Tomato Upma Recipe In Telugu: రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటోతో చేసిన ఉప్మా అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు గోధుమ రవ్వతో చేసిన ఉప్మాను తప్పకుండా డైట్ లో చేర్చుకుంటారు. నిజానికి ఈ ఉప్మా రోజు అల్పాహారం లో భాగంగా తీసుకుంటే బోలెడు లాభాలు కలుగుతాయి. పిల్లలనుంచి పెద్దవారి వరకు ఇష్టపడే తినే ఈ ఉప్మాను వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ ఉప్మాను సరదాగా తయారు చేసుకుంటే.. మరి కొంతమంది వివిధ రకాల కూరగాయలను వేసుకొని చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా టమాటాతో చేసిన ఉప్మా ఎక్కువమంది తింటూ ఉంటారు. అయితే చాలామంది దీని ఇంట్లో తయారు చేసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు పడి సరైన రుచి పొందలేకపోతున్నారు. నిజానికి ఈ ఉప్మా సరైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో? దీనికి కావలసిన పదార్థాలు ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

కావలసిన పదార్థాలు:
ఉప్మా రవ్వ
టొమాటోలు (కట్ చేసి)
కారం మిరపకాయలు (కట్ చేసి)
కొత్తిమీర (చెక్కలుగా తరిగి)
అల్లం (తరిగి)
కరివేపాకు
ఉప్పు
ఉల్లిపాయ (కట్ చేసి)
పసుపు
జీలకర్ర
నూనె
ముక్కలు చేసిన వేరుశనగలు

తయారీ విధానం: 
ఈ ఉపమాన తయారు చేసుకోవడానికి ముందుగా అల్లం, వెల్లుల్లి పొట్టు తీసి వాటిని మిక్సీలో వేసుకొని బాగా మిశ్రమంలో తయారు చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే టమాటోలను తీసుకొని కూడా బాగా శుభ్రం చేసుకుని మిక్సీలో వేసుకొని మిశ్రమంలా తయారు చేసుకోండి.

ఆ తర్వాత స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని అందులో నూనె లేదా నెయ్యి వేడి చేసి అందులో ఉప్మా రవ్వని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సన్నని మంటపై అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఈ రవ్వను పక్కన పెట్టుకొని స్టవ్ పై మరో బౌల్ పెట్టుకొని వేడి చేసుకోండి.

ఇలా బాగా వేడి చేసుకున్న నూనెలో వేరుశనగలు, టొమాటో ప్యూరీ, ఉల్లిపాయ, కారం మిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించండి. ఇలా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్ని వేసి మరికొద్ది బాగా వేపుకోవలసి ఉంటుంది. 

ఇలా అన్ని వేపుకున్న తర్వాత అందులో ఉప్మా రవ్వను వేసి బాగా పది నిమిషాల పాటు సన్నని మంటపై వేపుకోండి. వేపుకున్న తర్వాత గోరువెచ్చని నీటిని కోసుకొని బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని.. వేడివేడిగా వడ్డించుకోండి. అంతే టమాటో ఉప్మా రెడీ అయినట్లే..

టిప్స్:
ఈ ఉప్మా రుచిగా ఉండడానికి తప్పకుండా కూరగాయలను చేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కూరగాయలు బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఇతర పదార్థాలను వేసి ఉడికించుకోవాల్సి ఉంటుంది. 
ఇందులో చాలామంది నార్త్ ఇండియన్ కసూరి మేతి కూడా వేసుకుంటారు.. ఇది వేసుకోవడం వల్ల రుచి మరింత రెట్టింపు అవుతుంది.

Read More: Bank Job Recruitment: నిరుద్యోగులకు బంఫర్‌ ఛాన్స్‌.. ఏకంగా మేనేజర్ అవ్వొచ్చు.. తక్కువ కాంపిటీషన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News