Turmeric For Face: కలుషితమైన గాలి, తీవ్రమైన సూర్యకాంతి వల్ల చాలా మందిలో ముఖంపై దుమ్ము విచ్చల విడిగా పేరుకుపోతుంది. దీంతో ముఖం నల్లగా, అందహీనంగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కాస్మెటిక్ క్రీమ్‌లను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు ఇంటి చిట్కాలను పాటించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి చిన్న చిన్న చర్మ సమస్యలకు పసుపు ఫేస్ ప్యాక్ వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫ్యాక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
పసుపు ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు:
పసుపు ఫేస్ ప్యాక్‌ను ముఖానికి వినియోగించడం వల్ల జిడ్డు తొలగిపోవడమేకాకుండా.. మొటిమల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా టర్మరిక్ ఫేస్ ప్యాక్‌ను చేతులు ట్యానింగ్ సమస్యలతో బాధపడుతున్నవారు వాడడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈ ఫేస్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడడం వల్ల కూడా సులభంగా ముఖంపై మెరుపు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
టర్మరిక్ ఫేస్ ప్యాక్ అప్లై చేయడానికి ముందుగా ఇలా చేయండి:
పసుపు ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడానికి ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముడతలు, ఇతర సమస్యలున్న ప్రభావిత ప్రదేశాల్లో అప్లై చేయడం వల్ల సులభంగా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా మొటిమల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫేస్ మాస్క్‌కు కావాల్సిన పదార్థాలు:
02 టీస్పూన్ శెనగపిండి
1/4 టీస్పూన్ పసుపు
అర టీస్పూన్ టమోటా రసం
02 టీస్పూన్ తాజా పెరుగు
టర్మరిక్ ఫేస్ ప్యాక్‌ను ఎలా తయారు చేయాలో తెలుసా?:
ఒక గిన్నెలో శెనగపిండిని తీసుకుని.. అందులో పసుపు, టొమాటో రసం, పెరుగు వేసి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి బాగా అప్లై చేసి, 15 నుంచి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..
ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook