Vegetable Idli Recipe: ఇడ్లీ సాంబార్ ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఎప్పుడైనా వెజిటబుల్ ఇడ్లీని ట్రై చేశారా? సాధారణ ఇడ్లీల కంటే దీని టేస్ట్ చాలా బాగుటుంది. అన్ని రకాల వెజిటబుడల్స్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని తయారు చేయడం కోసం బియ్యం, పెసరపప్పు, కూరగాయలు ఉపయోగిస్తారు. వెజిటబుల్ ఇడ్లీలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా తేలికపాటి భోజనంగా తినవచ్చు.
కావలసిన పదార్థాలు:
2 కప్పుల బియ్యం
1 కప్పు పెసరపప్పు
1/2 కప్పు తరిగిన కూరగాయలు (ఉల్లిపాయలు, క్యాప్సికం, క్యారెట్లు, బీన్స్ మొదలైనవి)
1/4 కప్పు తరిగిన కొత్తిమీర
1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
1/2 టీస్పూన్ కారం పొడి
1/4 టీస్పూన్ పసుపు
ఉప్పు రుచికి సరిపడా
నూనె వేయడానికి
తయారీ విధానం:
బియ్యం, పెసరపప్పును కలిపి 6 గంటల పాటు నానబెట్టుకోండి. నానబెట్టిన బియ్యం, పెసరపప్పును నీటితో బాగా కడిగి, మెత్తగా రుబ్బుకోండి. తరిగిన కూరగాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు కలపండి. మిశ్రమాన్ని 6-8 గంటల పాటు పులియబెట్టండి. ఇడ్లీ స్టీమర్‌ను వేడి చేసి ఇడ్లీ పాత్రలలో నూనె రాసి, పిండిని పోయాలి.
10-12 నిమిషాలు లేదా ఇడ్లీలు ఉడికే వరకు ఆవిరిమీద ఉడికించాలి. తరువాత టమోటా చట్నీ లేదా కొబ్బరి చట్నీతో వడ్డించండి.
చిట్కాలు:
నచ్చిన ఏ కూరగాయలనైనా ఉపయోగించవచ్చు.
పిండిని మరింత రుచికరంగా చేయడానికి కొద్దిగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా కలుపుకోవచ్చు.
ఇడ్లీలను మరింత మెత్తగా చేయడానికి పిండిని బాగా రుబ్బుకోండి.
ఇడ్లీలను ఆవిరిలో ఉడికించేటప్పుడు ఇడ్లీ పాత్రలకు నూనె రాసి ఉంచండి.
వెజిటబుల్ ఇడ్లీ పోషక లాభాలు:
వెజిటబుల్ ఇడ్లీలో విటమిన్ ఎ, సి, బి6, ఫోలేట్ వంటి విటమిన్ల పుష్కలంగా లభిస్తాయి. ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా తయారు అవుతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. వెజిటబుల్ ఇడ్లీ ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియకు మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి