Hathya Teaser: ఆసక్తి రేకిస్తోన్న ‘హత్య’ టీజర్.. ఈ నెల 24న గ్రాండ్ గా విడుదల..

Hathya Teaser: తెలుగు సహా అన్ని భాషల్లో థ్రిల్లర్ జానర్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో వస్తోన్న మరో సైకాలాజిక్ థ్రిల్లర్ మూవీ ‘హత్య’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో  ఈ సినిమా యూనిట్ మీడియాతో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 10, 2025, 08:10 PM IST
Hathya Teaser: ఆసక్తి రేకిస్తోన్న ‘హత్య’ టీజర్.. ఈ నెల 24న గ్రాండ్ గా విడుదల..

Hathya Teaser: తెలుగులో ఆ మధ్య  ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌ చిత్రంతో మెప్పించిన  శ్రీ విద్య బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ జ‌న‌వ‌రి 24న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమాను మహాకాళ్‌ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి  గ్రాండ్ గా ప్రొడ్యూసర్ చేశారు. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ లీడ్ రూల్స్ లో యాక్ట్ చేశారు. తాజాగా ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో గ్రాండ్ గా  జ‌రిగింది. ప్ర‌ముఖ న‌టుడు ర‌వివ‌ర్మ చేతుల మీదుగా టీజ‌ర్ రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కురాలు శ్రీవిద్య బ‌స‌వ మాట్లాడుతూ ..‘‘నా ఫస్ట్ మూవీ ‘మధ’ చిత్రాన్ని ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లిన మీడియాకు, ఆద‌రించిన ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. ఇపుడు ఐదేళ్ల గ్యాప్ తర్వాత  ఇప్పుడు నేను హ‌త్య చిత్రంతో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాను. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోనే రెండో సినిమా కూడా చేస్తున్నాను. ఇది అంద‌రికీ తెలిసిన స్టోరి  అయిన‌ప్ప‌టికీ గ్రిప్పింగ్‌గా, అందిరినీ మెప్పిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది.  ఈ సినిమాకు చాలా హార్డ్ వ‌ర్క్‌ చేశాము. ఎంతో శ్రద్దతో స్క్రీన్ ప్లే రాసుకుని చేసిన సినిమా ఇది. ఈ ప్ర‌యాణంలో నాకెంతో స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్ స‌హా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  న‌రేష్ అద్భుత‌మైన బీజీఎంను అందించాడు.

అభిరాజ్ విజువ‌ల్స్ బాగా వచ్చాయి.  అనిల్ ఎడిటింగ్ సినిమాను గ్రిస్పింగ్ గా ఉంది.  ‘మ‌ధ’టైమ్ లో  ర‌వివ‌ర్మ‌ నాకు ప‌రిచ‌యం అయ్యారు. క‌లిసి ప‌ని చేద్దామ‌ని అన్నారు. అంత మంచి న‌టుడు నన్ను అప్రోచ్ కాగానే నాకెంతో ఆనందమేసింది. ఇప్పుడు హ‌త్య స్క్రిప్ట్ రెడీ చేసేట‌ప్పుడు ర‌విని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. ఆయ‌న చాలా కొత్త‌గా క‌నిపిస్తారు. నెక్ట్స్ లెవ‌ల్ యూనిక్ క్యారెక్ట‌ర్‌ లో ఈ సినిమాలో అదరగొడ్డటం గ్యారంటీ. పూజా రామ‌చంద్ర‌న్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆమె త‌న న‌ట‌న‌తో దాన్ని మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లింది. ధ‌న్య బాల‌కృష్ణ కూడా ఎంతో స‌పోర్ట్ చేసిందన్నారు. సినిమాను బాగా తీయ‌టానికి ఏం చేయాల‌ని అని ఆలోచించి చేసే టీమ్‌తో ప‌ని చేయ‌టం ఎంతో ప్లస్ అయ్యిందన్నారు.

 

న‌టుడు ర‌వివ‌ర్మ మాట్లాడుతూ ‘‘నటుడిగా ముందు నుంచి ఢిఫరెంట్  సినిమాలు చేయటానికే ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాను. అందుకనే ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్కుతుందన్నారు.  ‘మ‌ధ’ సినిమా టీజ‌ర్ చూడ‌గానే నేను శ్రీవిద్య‌కు కాల్ చేశాను. నేను కూడా సినిమాలో భాగం అవుతాన‌ని అన్నాను. అలా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు.

న‌టి పూజా రామ‌చంద్ర‌న్ మాట్లాడుతూ..‘‘నాకు కుమారుడు పుట్టిన తర్వాత యాక్ట్ చేసిన తొలి సిినిమా ఇది. చాలా మంది నాకు సినిమాలు ఆఫ‌ర్ చేసిన నో చెబుతూ వ‌చ్చాను.ఇందులో పాత్ర నచ్చడంతో ఈ సినిమా చేసాను. ఈ మూవీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News