B Jaya birth Anniversary: భానుమతి, విజయ నిర్మల తర్వాత ఆ రేంజ్ లో హిట్స్ అందించిన లేడీ డైరెక్టర్ బి. జయ..

B Jaya birth Anniversary: తెలుగు సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ ను  వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి మహిళ దర్శకుల్లో బి.జయ ఒకరు. తెలుగులో భానుమతి, విజయ నిర్మల తర్వాత ఎక్కువ సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడం బి.జయ ప్రత్యేకత. జనవరి 11న ఆమె జయంతి సందర్భంగా ఈ లేడీ డైరెక్టర్ సినీ ప్రస్థానంపై చిన్న ఫోకస్..

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 10, 2025, 07:53 PM IST
B Jaya birth Anniversary: భానుమతి, విజయ నిర్మల తర్వాత ఆ రేంజ్ లో హిట్స్ అందించిన లేడీ డైరెక్టర్ బి. జయ..

B Jaya birth Anniversary: చలన చిత్ర పరిశ్రమ టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో మహిళలు రాణించడం అనేది చాలా అరుదు.  అందులోనూ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో రాణించి పేరు తెచ్చుకున్న వారు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అలాంటి మహిళ దర్శకుల్లో బి.జయకు ప్రత్యేక స్థానం ఉంటుందనే చెప్పాలి.  తెలుగులో మహిళ దర్శకులు అనగానే ముందుగా మనకు  భానుమతి, విజయనిర్మల వంటివారి పేర్లు వినిపిస్తాయి. వీరిద్దరి తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలను డైరెక్ట్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకురాలు బి.జయ పేరు తప్పుకుండా ఉంటుంది. జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించి, కొన్ని చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన తర్వాత సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ వీక్లీని స్థాపించి పత్రికా రంగంలో రాణించి నిష్ణాతులు అనిపించుకున్నారు.  

ఆ తర్వాత దర్శకురాలిగా తన ప్రయాణం మొదలుపెట్టి వరుస సక్సెస్ లు అందుకున్నారు.  1964 జనవరి 11న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు బి.జయ. చెన్నయ్‌ యూనివర్సిటీలో  ఎం.ఎ.(ఇంగ్లీష్‌ లిటరేచర్‌), జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు. అంతేకాదు, అన్నామలై విశ్వవిదాలయంలో ఎం.ఎ.(సైకాలజీ) చదివారు. ఎడ్యుకేషన్ పూర్తి కాగానే ఆంధ్రజ్యోతి దినపత్రికలో సినిమా జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా పనిచేశారు. ఆ రోజుల్లోనే సినిమా జర్నలిస్ట్‌లలో డైనమిక్‌ మహిళగా  పేరు తెచ్చుకున్నారు. ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పడం జయకు మొదటి నుంచీ అలవాటు. పత్రికలలో ఆమె రాసే ఆర్టికల్స్‌ కూడా అలాగే ఉండేవి. దాంతో అందరి దృష్టినీ ఆకర్షించారు జయ. పత్రికా రంగంలో కొన్నేళ్లపాటు కొనసాగిన తర్వాత సినిమా రంగంపై ఆమె అభిరుచితో  డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరి కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు.

అదే సమయంలో ఫిల్మ్‌ జర్నలిస్ట్‌గా, పి.ఆర్‌.ఓ.గా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న బి.ఎ.రాజును పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పూర్తి అంకితభావంతో సినిమా రంగానికే తమ జీవితాన్ని కేటాయించారు.  అప్పటివరకు తమకు ఉన్న అనుభవంతో 1994లో సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ వీక్లీని సొంతంగా ప్రారంభించారు. తొలి సంచికతోనే సంచలనం సృష్టించారు. ఆరోజుల్లో ప్రముఖంగా వున్న సినీ వారపత్రికలకు పోటీగా సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ వీక్లీని నిలబెట్టారు బి.ఎ.రాజు, బి.జయ దంపతులు. ఆరోజు మొదలుకొని చివరి రోజుల వరకు ఒక్క వారం కూడా పత్రిక ఆలస్యం అవకుండా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఘనత ఆ దంపతులకు దక్కుతుందనే చెప్పాలి.  

చలన చిత్ర రంగంలో  ఎన్నో యేళ్లుగా ఉన్న అనుబంధం, డైరెక్షన్  తనకు ఉన్న ప్యాషన్‌ కారణంగా దర్శకత్వం వైపు జయ దృష్టి సారించారు. దానికి భర్త బి.ఎ.రాజు కూడా పూర్తి సహాయ, సహకారాలు అందించారు. దీంతో సూపర్‌హిట్‌ ఫ్రెండ్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా ‘ప్రేమలో పావని కళ్యాణ్‌’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి బి.జయ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ తర్వాత ‘చంటిగాడు’ చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టుకున్నారు.  ఫస్ట్ మూవీతోనే  సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు జయ. ఈ సినిమా 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్‌, లవ్‌లీ, వైశాఖం వంటి సినిమాలను డైరెక్ట్ చేసారు. ఈ రకంగా మహిళ దర్శకురాలిగా  భానుమతి, విజయనిర్మల తర్వాత అంతటి సక్సెస్‌ఫుల్‌ దర్శకురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసుకున్నారు  బి.జయ.

బి.ఎ.రాజు, బి.జయ దంపతులకు తెలుగు చలన చిత్ర పరిశ్రమతో మంచి  అనుబంధం ఉంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్‌ అందరికీ వీరంటే ప్రత్యేక అభిమానం. ఇక తోటి జర్నలిస్టులతో ఈ దంపతులకు మంచి అనుబంధం ఉన్నది. అందరితో కలివిడిగా ఉండేవారు.  చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవించేవారు. ఆ కారణంగానే సినిమా జర్నలిస్టులందరూ వారిని ఆత్మీయులుగా భావించేవారు. 2018లో బి.జయ మరణం అందర్నీ కలచివేసిందనే చెప్పాలి. తమ కుటుంబ సభ్యురాలు దూరమైందని సినీ పాత్రికేయ కుటుంబం అంతా భావించారు. బి.జయతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె జయంతి సందర్భంగా ఫిల్మ్‌ జర్నలిస్టులంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News