NTR Film Awards: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజండరీ నటుడిగా కీర్తింపబడిన ఎన్టీఆర్ పేరిట సినీ రంగంలో కళా వేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో 2023 యేడాదికి గాను ఎన్టీఆర్ ఫిల్మ్స్ అవార్డ్స్ వేడుక హైదరాబాద్ "దసపల్లా" హోటల్లో అవార్డుల ప్రధానోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో జరిగింది. "కళావేదిక" (R.V.రమణ మూర్తి ), " రాఘవి మీడియా" ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ గ్రాంట్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప, మురళి మోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ కే. ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి శ్రీ టి. ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి మరియు కొంత మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ : ఎన్టీఆర్ గారి పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘన విజయాన్ని అందుకున్న నాయకుడు కూడా ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం సహా ఎన్నో సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడటం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్ అని కొనియాడారు. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసారు.
నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ : ఎన్టీఆర్ అనే మూడంటే మూడు అక్షరాలు సినీ, రాజకీయ రంగమైన సంచలనానికి మారు పేరు. సినిమా రంగంలో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ప్రతి నాయకుడు పాత్రతో కూడా మెప్పించిన ఘనత ఆయనకు దక్కుతుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. పేదల కోసం అదే విధంగా ఆడవారి హక్కుల కోసం పోరాడి వారి హక్కులను వారికి అందించిన మహనీయుడు. అలాంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం గా భావిస్తున్నాను. ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ గా నిర్వహించిన కళావేదిక వారికి అభినందనలు తెలియజేసారు.
అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత గణపతి రెడ్డి గారు మాట్లాడుతూ : ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం, ఈ ఈవెంట్ లో నేను కూడా స్పాన్సర్ గా ఉండడం చాలా ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. . గతంలో కళావేదిక వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కళావేదిక తో పాటు రాఘవే మీడియా మధు భాగమవడం. అదేవిధంగా ఈవెంట్ ఇంత ఘనంగా జరిపించడం చాలా మంచి విషయమన్నారు.
నందమూరి మోహన్ రూప మాట్లాడుతూ : తెలుగు జాతి కోసం పుట్టి తెలుగువారి ఆత్మగౌరవం కోసం బ్రతికిన వ్యక్తి తెలుగువారు దేవుడిగా భావించే నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ ఒక లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వంగా తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నామంటే అది అన్నగారి వల్లే సాధ్యమందన్నారు. ఆయన అప్పట్లో చేసినటువంటి మల్లీశ్వరి, పాతాళ భైరవి సినిమాలతోనే ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు పోషించి అఖండ విజయం అందుకున్న సినిమా దానవీరశూరకర్ణ. ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో నటిస్తూ ఇటీవల కాలంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోగా నిలబడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కళావేదిక భువన మరియు రాఘవ మీడియా వారికి అభినందనలు తెలియజేసారు.
కళావేదిక మరియు రాఘవి మీడియా అధినేతలు మాట్లాడుతూ : ఈవెంట్ కి పిలవగానే విచ్చేసిన మురళీమోహన్ గారికి, నందమూరి మోహన్ కృష్ణ గారికి, మోహన్ రూపా గారికి మరియు ఇతర ప్రముఖులకి పేరు పేరున కృతజ్ఞతలు.
ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న విజేతలు - ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న వారి విషయానికొస్తే.. మురళీమోహన్, నందమూరి మోహన్ కృష్ణ ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించారు. ఉత్తమ కథానాయకుడిగా బేబీ చిత్రానికి ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడిగా బేబీ చిత్రానికి సాయి రాజేష్, ఉత్తమ నిర్మాతగా భగవంతు కేసరి చిత్రానికి సాహు గారపాటి, ఉత్తమ విలన్ గా యక్షిని వెబ్ సిరీస్ నుంచి అజయ్, ఉత్తమ నూతన దర్శకుడిగా డాక్టర్ దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ నూతన నటుడిగా తిరువీర్ కి ఎన్టీఆర్ ఫిలిం పురస్కారాలను గెలుచుకున్నారు.
అవార్డులు గెలుచుకున్న వారికి మురళీమోహన్ మరియు నందమూరి మోహన్ కృష్ణ చేతుల మీదగా అవార్డులు అందజేయడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ లిరిక్ రైటర్ గా కాసర్ల శ్యామ్, బెస్ట్ రైటర్ గా కళ్యాణ్ చక్రవర్తి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రఘుకుంచె, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్ గా శరణ్య ప్రదీప్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా హర్షవర్ధన్, బెస్ట్ మేల్ సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా దాశరధి శివేంద్ర, బెస్ట్ ఆర్ డైరెక్టర్ గా నాగేంద్ర , బెస్ట్ కమెడియన్ గా రచ్చ రవి, బెస్ట్ ఎడిటర్ గా చోటా కే ప్రసాద్, బెస్ట్ ఫిమేల్ సింగర్ గా మంగ్లీ, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా విజయ్ పొలాకి, బెస్ట్ డెబ్యు మ్యూజిక్ డైరెక్టర్ గా ధ్రువన్, బెస్ట్ డెబ్యు సపోర్టింగ్ యాక్టర్ గా లక్ష్మణ్ మీసాల, బెస్ట్ నెగటివ్ సపోర్టింగ్ రోల్ లో సాహితీ దాసరి, స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్ గా గౌరీ కృష్ణ, బెస్ట్ డెప్ యు రైటర్ గా అజ్జు మహకాళి, బెస్ట్ రివ్యూ కమిటీ అనగా లక్ష్మణ్ టేకుమూడి, స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ గా త్రినాథ్ ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ని అందుకోవడం జరిగింది.
Read more:Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter