Ileana Divorce: ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ అంటే.. ఇలియానా పేరు తప్పకుండా గుర్తొచ్చేది. పోకిరి లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సినిమాలలో సైతం నటించింది ఈ సుందరి. అయితే కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా సినిమాలకు దూరమై.. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ని గడుపుతోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ గురించి వస్త్వంలో కొన్ని రూమర్స్ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి.
అక్కడ ఒక మోస్తారు సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈమె పెళ్లి చేసుకోకుండానే గర్భవతిని అయ్యాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలంటూ చాలామంది రకరకాల కామెంట్లు చేస్తూ విమర్శించారు కూడా. అయితే అవేవీ పట్టించుకోలేదు ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత పండంటి కొడుకుకు జన్మనిచ్చి, కొన్ని రోజుల తర్వాత తన భర్తను పరిచయం చేసింది. తన భర్త అంటే తనకు చాలా ఇష్టమని, తన భర్తను ఎవరు విమర్శించొద్దండి అంటూ కూడా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఇలియానాకు తన భర్త అంటే ఎంత ప్రేమో అంటూ చాలామంది కామెంట్లు కూడా చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఈ ముద్దుగుమ్మ తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ఇలియానా ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే 2019 ఆగస్టు 28న వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు కూడా ప్రచారం చేశారు. దీంతో అసలు వీరిద్దరికి ఎప్పుడు పెళ్లి జరిగింది అంటూ వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఆ తర్వాత 2023 మే లో ఇలియానా మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది 2023 ఆగస్టు న ఒక కొడుకుకు జన్మనిచ్చింది ఇలియానా. పెళ్లికి ముందే గర్భం దాల్చిన ఈమె పెళ్లి తర్వాత కొడుకుకు జన్మనిచ్చింది. ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాబు ఆలనా పాలన విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. ఇలియానా సినిమాల్లోకి రావడం తన భర్తకు ఇష్టం లేదన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ కారణంగానే ఇప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్తలు వచ్చి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ జోరుగా వార్తలు ప్రచారం అవుతూ ఉండడం గమనార్హం.
మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం.