Prayag raj maha kumbh mela: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో ఏపీ మంత్రి, తన సతీమణితో కలిపి పాల్గొన్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో ప్రత్యేకంగా పూజలు చేశారు.
ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. జన్వరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో ప్రతిరోజు కుంభమేళకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతునేఉంది.
కుంభమేళకు ఇప్పటి వరకు దాదాపుగా.. 53 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భూటాన్ రాజు సైతం ఇటీవల ప్రయాగ్ రాజ్ కు వచ్చారు. మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ లు, అధికారులు పుణ్యస్నానాలు ఆచరించారు మరోవైపు సెలబ్రీటీలు కూడా కుంభమేళలకు భారీగా వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి నారాలోకేష్ తన సతీమణితో కలిసి ప్రయాగ్ రాజ్ కు వెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా బోట్ లో త్రివేణి సంగమంకు వెళ్లారు.
కుంభమేళ త్రివేణి సంగమంకు వెళ్లి అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడి అధికారులు ఏపీ మంత్రికి ప్రత్యేకంగాస్వాగతం పలికారు. ఏపీ మంత్రి నారాలోకేష్ తో, బ్రాహ్మణితో ఫోటో దిగేందుకు అభిమానులు భారీగా ఆసక్తి చూపించారు.
కుంభమేళ ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో ముగియనుంది. ఈ క్రమంలో కుంభమేళను పొడిగించాలని కూడా ఇప్పటికే అనేక డిమాండ్ లు తెర మీదకు వస్తున్నాయి. దీనిపైన కూడా యోగి సర్కారు కీలక మైన నిర్ణయం తీసుకునేందుకు రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు కుంభమేళలకు ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా రైళ్లను నడిపిస్తుంది. భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కుంభమేళకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.